మంచు మనోజ్-భూమా మౌనిక రెడ్డి ల పెళ్లి విషయం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మంచు మనోజ్ మౌనిక రెడ్డి ని వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యేకే అతను డైరెక్ట్ గా వినాయకుని సమక్షంలో మీడియా ముందుకు వచ్చాడనేది చాలామంది వాదన. అయితే మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డి ల పెళ్లి పై మంచు మోహన్ బాబు అయన ఫ్యామిలీ సుముఖం గా లేరు అనే వాదన తెరపైకి వచ్చింది. అంటే మంచు మనోజ్ చాలా రోజులుగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఈ మాట మంచు ఫ్యామిలీని అడిగినా.. వారు తికమకగా సమాధానం చెప్పేవారు. అయితే మనోజ్ మౌనికతో కొంతకాలంగా కలిసి ఉంటున్నాడని, అందుకే మనోజ్ ఫ్యామిలీతో కలవడం లేదని, మనోజ్ చేసే పనులు నచ్చకే మోహన్ బాబు కూడా మనోజ్ ని దూరం పెట్టారనే మాట సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది.
మోహన్ బాబు-విష్ణు ఒకే మాట మీద ఉంటున్నారని అంటున్నారు. అయితే ఇప్పుడు మనోజ్ - మౌనిక రెడ్డిల వివాహ తేదీ కూడా ఫిక్స్ అయ్యింది అని, త్వరలోనే మౌనిక రెడ్డి అక్క అఖిల ప్రియా మీడియా సమావేశం పెట్టి డేట్ అనౌన్స్ చేయబోతుంది అంటున్నారు. 2015 లో మనోజ్ ప్రణతి రెడ్డిని, మౌనిక వేరొకరితో ఏడడుగులు నడిచినా.. తర్వాత ఇద్దరు తమ పార్ట్నర్స్ తో విడిపోవడం, ఆ తర్వాతే మనోజ్-మౌనికలు కలిసి నడవాలని నిర్ణయించుకోవడం జరిగింది అని, కొన్నాళ్ళు చెన్నై ఇద్దరూ కలిసే ఉన్నారని, ఈ మధ్యనే మనోజ్-మౌనికలు హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారనే న్యూస్ కూడా వినిపిస్తుంది. ఇదంతా మోహన్ బాబుకి నచ్చడం లేదని, మనోజ్ పెళ్లి విషయంపై మోహన్ బాబు ఎక్కడా ఏమి మాట్లాడం లేదు అని అంటుంటే.. కాదు మోహన్ బాబు ఒప్పుకో బట్టే మనోజ్ ఇలా మౌనిక రెడ్డితో రిలేషన్ బయటపెట్టాడని, పెళ్ళికి రెడీ అయ్యాకే మౌనిక ని పరిచయం చేసాడని అంటున్నారు.