Advertisement
Google Ads BL

వైరల్: విజయ్ తో రష్మిక సెల్ఫీ


విజయ్ ని దగ్గరగా చూడాలి, విజయ్ తో కలిసి ఎప్పటినుండో నటించాలనే కలను సాకారం చేసుకుంది టాప్ హీరోయిన్ రష్మిక. కోలీవుడ్ లో కార్తీ లాంటి హీరోలతో సినిమాలు చేసినా రశ్మికకి అక్కడ సక్సెస్ దక్కలేదు. ఆలోపు తెలుగులో టాప్ చైర్ కి దగ్గరవడమే కాదు, కాలం కలిసొచ్చి బాలీవుడ్ ఫ్లైట్ కూడా ఎక్కింది. పుష్ప తో పాన్ ఇండియా హిట్ కొట్టింది. ఇక తమిళంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అంటే చాలా ఇష్టమని, ఆయనతో సినిమా చెయ్యాలనే నా డ్రీం నెరవేరింది అంటూ వారసుడు సినిమా ఓపెనింగ్ రోజునే తెగ ఎగ్జైట్ అయ్యింది.

Advertisement
CJ Advs

విజయ లాంటి స్టార్ హీరో తో సినిమా చేస్తున్నా అంటూ అప్పుడప్పుడు సెట్స్ లో ఆనందపడిపోయే రష్మిక తాజాగా విజయ్ తో ఓ సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. రష్మిక తో విజయ్ సెల్ఫీ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. రష్మిక ఆ సెల్ఫీ లో నవ్వుతూ కనిపించగా, విజయ్ కాస్త మొహమాటంగా కనిపించారు. రష్మిక ఫాన్స్ దాన్ని ట్రెండ్ చేస్తూ ఆమె అదృష్టాన్ని పొగిడేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ వారసుడు లో నటిస్తున్న రష్మిక తెలుగులో పుష్ప పార్ట్2 రెగ్యులర్ షూట్ కోసం రెడీ అవుతుంది. ఇక ఆమె బాలీవుడ్ నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

Rashmika shares a selfie with Vijay:

Rashmika Mandanna is all smiles in latest selfie with Thalapathy Vijay from Varisu set
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs