నిజంగా ప్రభాస్ చేసిన పనికి అందరూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే మనసునిండా దుఃఖం, కళ్ళ నిండా కన్నీళ్లు ఉన్నప్పటికీ.. ఇప్పుడు ప్రభాస్ చేసిన ఓ పని ఆయనని అభిమానులు దేవుడిలా కొలిచే పరిస్థితి. కారణం పెదనాన్న కృష్ణం రాజు మరణంతో ఆయన అభిమానులు, ప్రభాస్ అభిమానులు కృష్ణం రాజుని చూడడానికి ఏపీలోని పలు ప్రాంతాల నుండి చాలామంది జూబ్లీహిల్స్ లోని కృష్ణం రాజు నివాసానికి తరలి వచ్చారు. ఆయన ఆఖరి చూపు కోసం అటు కనకమామిడి ఫామ్ హౌస్ ఇటు ఆయన నివాసం అభిమానులతో నిండిపోయింది. అయితే వారు చాలా దూరం నుండి వేరే ఊర్ల నుండి రావడంతో వారందరికీ ప్రభాస్ తన టీం చేత భోజన ఏర్పాట్లు చేయించడం హాట్ టాపిక్ అయ్యింది.
మామూలుగానే కృష్ణం రాజు, ప్రభాస్ లది పెట్టే చెయ్యి. వారు చేసే సినిమాల సెట్స్ లోకి కెరీర్లు తెప్పించి మరీ నటులకి, టెక్నీషియన్స్ కి పెడుతుంటారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ ఈ విషయంలో ప్రభాస్ ని పొగిడేస్తుంటారు అంతేకాకుండా కృష్ణం రాజు ఇంటికి ఎవరొచ్చినా వారికి భోజనం పెట్టకుండా పంపరని చాలామంది చెబుతుంటారు. కానీ ఇలాంటి బాధాకరమైన సమయంలోనూ అభిమానుల ఆకలిని గుర్తించిన ప్రభాస్ కి ఆయన ఫాన్స్ రెండు చేతులు ఎత్తి దణ్ణం పెడుతుంటే.. మిగతా వారు ప్రభాస్ మంచి మనసు కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.