‘గురూజీ.. కల్యాణ్‌కి రీమేక్స్.. వారికి ఖతర్నాక్ కథలా?’.. సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్ ఇది. గురూజీ అంటే ఎవరో తెలుసుగా? మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎప్పుడైతే మహేష్ బాబుతో SSMB28 సినిమా షూటింగ్ మొదలైందో.. అప్పటి నుండి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ త్రివిక్రమ్‌పై ఇలా కామెంట్స్ చేస్తున్నారు. SSMB28 సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో మహేష్ బాబు సరికొత్తగా కనిపిస్తున్నారు. ఆ లుక్ చూసి.. అలా కామెంట్ చేస్తున్నారో.. లేదంటే, పవన్ కల్యాణ్‌తో అలాంటి సినిమా చేయకుండా.. రీమేక్స్‌కి సపోర్ట్ చేయడం ఇష్టం లేక అలా అంటున్నారో తెలియదు కానీ.. గురూజీపై మాత్రం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ హీరోగా చేసిన ‘భీమ్లా నాయక్’ చిత్రం రీమేక్ అనే విషయం తెలిసిందే. ఆ సినిమాని వెనుకుండి నడిపించింది అంతా త్రివిక్రమే. అలాగే ఇప్పుడు ‘వినోదయ సిత్తం’ సినిమా రీమేక్ విషయంలో కూడా అంతా త్రివిక్రమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా రీమేక్ చేయాల్సి వస్తే.. కథ, స్ర్కీన్‌ప్లే అంతా త్రివిక్రమే చూడాలనేలా పవన్ కల్యాణ్ కండీషన్ పెట్టినట్లుగా ఈ మధ్య వార్తలు వచ్చాయి. అందుకేనేమో... మావాడికి రీమేక్స్.. మిగతా వాళ్లకి స్ట్రయిట్ స్టోరీసా.. అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఓపెన్ అవుతున్నారు. ఇతర సినిమాల ప్రభావంతో కాకుండా త్రివిక్రమ్ మనసుపెట్టి కథ రాస్తే.. ఎటువంటి విజయాలు వస్తాయో.. ‘అత్తారింటికి దారేది’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలు నిరూపించాయి. అలాంటి కథ ఒకటి ఇప్పుడు మా వాడికి కూడా సెట్ చేయవచ్చుగా.. అంటూ త్రివిక్రమ్‌కు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రిక్వెస్ట్‌లు చేస్తున్నారు. వాళ్ల పిచ్చికానీ.. ఆయన రాసినా.. ఈయన చేయాలిగా..!!