మహేష్ బాబు ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. కారణం మహేష్ బాబు - త్రివిక్రమ్ కలయికలో హై OCTANE ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నట్టుగా మేకర్స్ ట్రీట్ ఇచ్చారు. ఆ సంతోషంలో ఉన్న మహేష్ ఫాన్స్ కి మరో సర్ ప్రైజ్ వచ్చి పడింది. అదే రాజమౌళి మహేష్ తో చెయ్యబోయే చిత్రం పై అప్ డేట్. గ్లోబ్‌ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మహేష్ తో చెయ్యబోతున్నట్టుగా రాజమౌళి సర్ ప్రైజ్ ఇవ్వగా.. దానితో మహేష్ ఫాన్స్ చాలా హ్యాపీ మోడ్ లో పండగ చేసుకుంటున్నారు. అంతలా ఖుషీగా ఉన్న మహేష్ ఫాన్స్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. కారణం మహేష్ బాబు జీ తెలుగు తో పెట్టుకున్న ఒప్పందమే.
ఆ ఒప్పందం ప్రకారం మహేష్ బాబు రీసెంట్ గా జీ తెలుగులో ప్రసారమవుతున్న డాన్స్ షోకి కూతురు సితార తో పాటు హాజరయ్యారు. అంతవరకూ ఓకె. కానీ ఇప్పుడు జీ తెలుగులో మొదలు కాబోయే ఓ సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ లో మహేష్ బాబు కనిపిస్తారని జీ తెలుగు చెప్పుకుంటుంది. అంతేకాకుండా ఆ సీరియల్ ఆర్టిస్ట్ లతో కలిసి మహేష్ బాబు దిగిన పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది జీ తెలుగు. అటు అద్భుతమైన సినిమాలు చేస్తున్న మహేష్ ఇలా సీరియల్స్ లో కనిపించడంపై మిగతా హీరోల ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు. దానిని డిఫెండ్ చేసుకోవడానికి మహేష్ ఫాన్స్ నానా తంటాలు పడుతున్నారు.