విక్రమ్ తో ఇప్పటికి గూస్ బంప్స్ తెప్పిస్తూ ఆడియన్స్ ని తెగ ఎంటర్టైన్ చేస్తున్న లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇండియా వైడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోతుంది. కమల్ హాసన్-ఫహద్ ఫాసిల్-విజయ్ సేతుపతిలతో మెస్మరైజ్ చేసిన లోకేష్ తో.. మ్యూజిక్ తో అందరి మదులని కొల్లగొట్టేసి ఇప్పటికీ విక్రమ్ థీమ్స్ నే వింటూ ఎంజాయ్ చేసేలా చేసిన అనిరుధ్ కాంబోలో ఎప్పుడెప్పుడు కొత్త మూవీ వస్తుందా అని తమిళ తంబీలే కాదు, తెలుగు ప్రేక్షకులు వెయిటింగ్. విక్రమ్ తర్వాత లోకేష్ కనగరాజ్ హీరో విజయ్ తో మూవీ ప్రకటించేశాడు. ఇంతకుముందే ఈ కాంబోలో మాస్టర్ మూవీ కోలీవుడ్ లో అదరగొట్టినా మిగతా లాంగ్వేజెస్ లో అంతగా పెరఫార్మ్ చెయ్యలేదు. కానీ విక్రమ్ తర్వాత లోకేష్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఇక విజయ్ తో చెయ్యబోయే మూవీని కూడా వరల్డ్ వైడ్ ఆడియన్స్ మెచ్చేలా పాన్ ఇండియాగానే చెయ్యబోతున్నాడు లోకేష్. విజయ్ ని గ్యాంగ్ స్టర్ గా చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది. అందుకే విజయ్ కి విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దూత్ ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. కెజిఎఫ్ లో అధీరా గా సంజయ్ దత్ విలనిజం ఏ రేంజ్ లో ఆకట్టుకుందో.. ఇప్పుడు అంతకన్నా మించి అతని రోల్ ఈ సినిమాలో లోకేష్ డిజైన్ చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. కేవలం విలన్ నే బాలీవుడ్ నుండి తేవడం లేదు.. హీరోయిన్ విషయంలోనూ లోకేష్ కన్ను బాలీవుడ్ మీదే ఉన్నట్లుగా తెలుస్తుంది.