Advertisement
Google Ads BL

ఫైనల్లీ సెట్స్ లోకి అడుగుపెట్టిన మహేష్


సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు చెయ్యబోయే SSMB28 పై ఫాన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. జూన్ లోనే మహేష్ బాబు SSMB28 సెట్స్ లోకి అడుగుపెడతారని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన రెగ్యులర్ షూట్ ఆలస్యమైంది. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్ మహేష్ చెయ్యబోతున్న ఈ ప్రాజెక్ట్ పై ట్రేడ్ లోను భారికి అంచనాలే ఉన్నాయి. గత రెండు నెలలుగా మహేష్ తన ఫ్యామిలీ తో కలిసి వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న ఆదివారం కృష్ణ రాజు గారు పార్థివ దేహానికి నివాళులు అర్పించి ప్రభాస్ ని ఆలింగనం చేసుకుని ఓదార్చారు మహేష్. ప్రస్తుతం మహేష్ ఫాన్స్ ఎంతో ఆత్రం గా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.

Advertisement
CJ Advs

అది ఈ రోజు సోమవారమే SSMB28 సెట్స్ లోకి మహేష్ బాబు ఎంటర్ అయ్యారు. మహేష్ భార్య నమ్రత Work mode ON! 😎📸 : Toooooo cooool @aalimhakim bhai! 🔥🔥🔥 అంటూ మహేష్ న్యూ లుక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. త్రివిక్రమ్ తో మహేష్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో గ్లామర్ డాల్ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక మిగతా నటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ మహేష్ ప్రాజెక్ట్ విషయంలో, మహేష్ లుక్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాతో ఇండస్ట్రీ లెక్కలు తిరగరాయాలని త్రివిక్రమ్ పక్కా ప్లాన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమా ఈ రోజే అఫీషియల్ గా రెగ్యులర్ షూట్ కి వెళ్లగా.. వచ్చే ఏడాది ఏప్రిల్ 28 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

SSMB28 Regular Shoot Today:

SSMB28 shooting update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs