Advertisement
Google Ads BL

నివేత మరో నిత్యా మీనన్ కాబోతుందా?


టాలీవుడ్ లో సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ నిత్య మీనన్.. స్టార్ హీరోల సరసన నటించకపోయినా.. ఆమె టాలెంట్ ఆమెని అభిమానుల దగ్గరకి చేర్చింది. చాలా సెలెక్టెడ్ గా కథలను ఎంచుకుని సినిమాలు చేస్తున్న నిత్య మీనన్ కి ఆమె బరువు ఆమెకి శాపమనే చెప్పాలి. అసలే పొట్టిగా ఉండే నిత్య మీనన్ బరువు పెరగడంతో మరింత లావుగా కనిపిస్తుంది. అందుకే ఆమెకి అవకాశాలు కూడా తగ్గాయనే చెప్పాలి. ఏదో వస్తున్న అవకాశాల్లో తనకి నచ్చిన స్క్రిప్ట్ తో ముందుకు వెళుతుంది. ప్రతిసారి లేడీ ఒరింటెడ్ మూవీస్ రావాలంటే రావు కదా..

Advertisement
CJ Advs

ఇప్పుడు అదే కేటగిరీలోకి వెళుతుంది మరో టాలెంటెడ్ బ్యూటీ నివేత థామస్. నాని జెంటిల్మన్, నిన్ను కోరి లాంటి సినిమాలతో మంచి నటిగా గుర్తింపు పొందిన నివేత థామస్ కూడా బరువు కారణంగానే ఆమెకి అంతగా అవకాశాలు రావడం లేదు. ఈమధ్యన చాలా రేర్ గా కనబడుతున్న నివేత నటించిన శాకినీ ఢాకిని త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో నివేత తో పాటుగా రెజినా స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే నివేత థామస్ గతంలో ఉన్న బరువు కన్నా ఇప్పుడు బాగా బరువు పెరిగి బొద్దుగా కనిపించడంతో.. నివేత మరో నిత్య మీనన్ కాబోతుందా అనే డౌట్ ఆడియన్స్ లో మొదలయ్యింది.

Is Nivetha going to be another Nithya Menon?:

Nivetha Thomas latest shocking look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs