Advertisement
Google Ads BL

తండ్రికొడుకులకి కోలుకోలేని షాకే


అక్కినేని తండ్రికొడుకులకి బాలీవుడ్ బిగ్ షాకిచ్చినట్లే కనిపిస్తుంది. మొన్నటికి మొన్న నాగ చైతన్య కి అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా రూపంలో కోలుకోలేని నిరాశ మిగిలింది. లాల్ సింగ్ చద్దా తో బాలీవుడ్ ఎంట్రీకి దారులు వేద్దామని నాగ చైతన్య కలలు కన్నాడు. చిన్నపాటి రోల్ అయినా.. ప్రమోషన్స్ కోసం చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాతో తనకి బాలీవుడ్ లో మార్గం సులువవుతుంది... అమీర్ ఖాన్ తనకి బాగా కలిసొస్తాడు అని ఏవేవో అనుకుంటే.. లాల్ సింగ్ చద్దా మాములుగా డిసాస్టర్ అవ్వలేదు. దానితో చైతు బాగా డిస్పాయింట్ అయ్యాడు. లాల్ సింగ్ చద్దా డిసాస్టర్ ఎఫెక్ట్ చైతు బాలీవుడ్ కెరీర్ పై పడుతుంది అనడంలో సందేహమే లేదు.

Advertisement
CJ Advs

ఇక తాజాగా నాగార్జున కి బ్రహ్మాస్త్ర షాకిచ్చినట్టే. ఎందుకంటే సినిమా హిట్టా.. ప్లాపా అనేది పక్కనబెడితే.. నాగార్జున కేరెక్టర్ బ్రహ్మస్త్రలో పెద్దగా ఇంప్రెస్ చేసేదిగా లేదు అని, నాగ్ అనవసరంగా బ్రహ్మాస్త్ర ఒప్పుకున్నారు, అంత చిన్న కేరెక్టర్ కోసం ఆయన ఊరూరా ప్రమోషన్స్ కోసం తిరిగారు.. గతంలో హిందీలో నాగార్జున కి ఓ స్పెషల్ క్రేజ్ ఉండేది.. ఇప్పుడు ఈ బ్రహ్మాస్త్ర చేసి అది పోగొట్టుకున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా తండ్రి కొడుకులని బాలీవుడ్ చాలా తక్కువ టైం లో భారీ నీరసాన్ని మిగిల్చింది అని గుసగుసలు కాదు ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు జనాలు.

Bollywood Disappointing for Akkineni heroes:

Nagarjuna role disappointing for Brahmastra
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs