Advertisement
Google Ads BL

కలర్ ఫుల్ గా కృష్ణ వ్రిందా విహారి ట్రైలర్


అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగ శౌర్య స్టైలిష్ లుక్స్ లో కనిపించబోతున్న కృష్ణ వ్రిందా విహారి ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఈ నెల 23 న రిలీజ్ కాబోతున్న కృష్ణ వ్రిందా విహారి ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. కృష్ణ వ్రిందా విహారి ట్రైలర్ మొత్తం కలర్ ఫుల్ కామెడీగా.. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా కనిపిస్తుంది. నాగ సౌర్య స్టైలిష్ లుక్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. వెన్నెల కిషోర్ ని ఆసుపత్రి బెడ్ మీద పాడుకోబెట్టిన సీన్ నుండి ట్రైలర్ ని స్టార్ట్ చేసారు. మడి ఆచారాలు ఉన్న పద్దతిగల కుటుంబం నుండి ఉద్యోగానికి వెళుతున్న ఏకైక వ్యక్తి కృష. కృష్ణ నీకు ఉద్యోగం వచ్చిందట కదా ఊరి పేరు నిలబెట్టాలి అన్న పెద్దాయనతో నేనేమన్నా వెళుతుంది ఒలంపిక్స్ కా .. ఉద్యోగానికి అంటూ నుదిటిన నామం పెట్టుకుని మరీ కృష్ణావతారంలో ఉన్న నాగ శౌర్య లుక్ ఫన్నీ గా ఉంది. 

Advertisement
CJ Advs

ఉద్యోగం లో చేరాక మడి ఆచారాలు వదిలేసి స్టైలిష్ లుక్ లోకి మారిపోయి అమ్మాయి ప్రేమలో పడడం, నాన్ వెజ్ కి దూరంగా ఉండడం, ప్రేమించిన అమ్మాయితో రొమాన్స్ అన్ని ట్రైలర్ లో హైలైట్ గా నిలవగా.. సత్య, రాహుల్ రామకృష్ణ కామెడీ ఫన్ జనరేట్ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేలా కృష్ణ వ్రిందా విహారి ట్రైలర్ కట్ ఉంది. ఐరా క్రియేషన్స్ నిర్మాణ విలువలు రిచ్ గా కనిపిస్తుంటే.. మహతి సాగర్ నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫి కలర్ ఫుల్ గా ఉన్నాయి. మరి థియేటర్స్ లో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా కృష్ణ వ్రిందా విహారి ఆడియన్స్ ని శాటిస్ ఫై చేస్తుంది అనడంలో సందేహమే లేదు.

కృష్ణ వ్రిందా విహారి ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Naga Shaurya Krishna Vrinda Vihari Trailer Launched:

Naga Shaurya, Anish R Krishna, Ira Creations Krishna Vrinda Vihari Trailer Launched
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs