Advertisement
Google Ads BL

బ్రహ్మాస్త్ర ప్లాప్.. ఎంటరైపోయిన కంగనా


బాలీవుడ్ లో ఏ స్టార్ కిడ్ ని కెలుకుదామా? ఏ సెలెబ్రిటీ ని తిడదామా? అని కాచుకుని కూర్చుంటుంది కంగనా రనౌత్. ఈ మధ్యన కంగనా రనౌత్ గర్వం అణిచేలా ధాకడ్ ప్లాప్ అవడంతో ఆమె మరింతగా మండిపడిపోతుంది. స్టార్ కిడ్స్ వలన బాలీవుడ్ బ్రష్టుపట్టిపోతుంది అనేది ఆమె వాదన. ఇక నేరుగా అలియా భట్ మీదే ఆమె తీవ్రమైన సెటైర్స్ వేస్తుంది. తాజాగా అలియా భట్-రణబీర్ కపూర్ ల బ్రహ్మాస్త్రకి నెగెటివ్ టాక్ రావడంతో ఆమె రంగంలోకి దిగిపోయింది. బ్రహ్మాస్త్ర కొంతమంది బావుంది అంటే.. మరికొంతమంది డిసాస్టర్ అంటున్నారు. ఈలోపు కంగనా బ్రహ్మాస్త్ర టీం పై, సినిమాపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Advertisement
CJ Advs

కంగనా తన ఇన్స్టా స్టోరీస్ లో బ్రహ్మాస్త్ర తీసి అయాన్ ముఖర్జీ 600 కోట్లు తగలబెట్టాడంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అయాన్ ఇంతవరకు తన జీవితంలో ఒక్క మంచి సినిమా కూడా తీయలేదంటూ ఫైర్ అయ్యింది.. అంతేకాదు పనిలో పనిగా కరణ్ జోహార్ ని ఏసుకుంది. కరణ్ తన సినిమా స్క్రిప్ట్‌ల కంటే ప్రతి ఒక్కరి శృంగార జీవితంపైనే ఎక్కువ ఆసక్తిని చూపిస్తాడని.. నకిలీ కలెక్షన్లు, ఫేక్ రివ్యూలు కొనుగోలు చేస్తాడని మండిపడింది. బ్రహ్మాస్త్ర మూవీకి బడ్జెట్ పెట్టడానికి ఫాక్స్ స్టూడియోస్ తనంతట తానుగా అమ్ముకోవాల్సి వచ్చిందని.. ఇలాంటి పనికిమాలిన సినిమాల వల్ల ఇంకా ఎన్ని స్టూడియోలు మూతపడతాయో అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అసలు అయాన్ ముఖర్జీని మేధావి అని పిలిచిన ప్రతి ఒక్కరినీ జైలులో పెట్టాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Brahmastra flop.. Kangana entered:

Kangana Ranaut Roasts Brahmastra, Claims Ayan Mukerji, Karan Johar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs