Advertisement
Google Ads BL

బిగ్‌బాస్ 6: అవుటయ్యేది ఆరోహిరావేనా?


సెప్టెంబర్ 4న కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. 20 కంటెస్టెంట్స్ (ఒక జంట కూడా) అలా హౌస్‌లోకి వెళ్లారో.. లేదో గేమ్ స్టార్ట్ చేశారు. ల్యాగ్ ఎందుకుని అనుకున్నారో.. లేకపోతే బిగ్ బాస్ ఆర్డర్ వేశాడో తెలియదు కానీ.. వెళ్లగానే ఎవరి గేమ్ వారు స్టార్ట్ చేశారు. ఏడుపులు, ఆరోపణలు, తిట్టుకోవడాలు వగైరా వగైరా.. మొదలైన మొదటి రోజే మొదలయ్యాయి. కెప్టెన్సీ టాస్క్‌తో పాటు ఫస్ట్ ఎలిమినేషన్ వరకు వ్యవహారం వచ్చింది. శనివారం, ఆదివారం నాగ్ క్లాస్‌లు ఇవ్వడమే కాకుండా.. ఒకరిని ఎలిమినేట్ చేసి బయటికి పంపించేందుకు అంతా సిద్ధమైంది. అయితే బయటికి వచ్చే ఆ ఒక్కరు ఎవరు? ఫస్ట్ ఎలిమినేషన్ క్రెడిట్ కొట్టేయబోతున్న ఆ కంటెస్టెంట్ ఎవరు?  

Advertisement
CJ Advs

 

ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఆరోహి రావు అని తెలుస్తుంది. ఈ వారం నామినేషన్స్‌లో ఆరోహి రావుతో పాటు ఇనయ సుల్తానా, అభినయశ్రీ, సింగర్ రేవంత్, జబర్ధస్థ్ ఫైమా, శ్రీ సత్య, చలాకీ చంటి ఉన్నారు. చివరి నిమిషంలో నామినేషన్స్ నుండి బాలాదిత్య తప్పించుకున్నాడు. ఈ నామినేషన్స్‌లో ఉన్న వారిలో సింగర్ రేవంత్‌ని ఎక్కువ మంది టార్గెట్ చేశారు. అయినా కూడా సింగర్ రేవంత్ ఓటింగ్ పరంగా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయనకున్న పాపులారిటీ గురించి తెలియంది కాదు. ఇనయ సుల్తానా, ఆరోహిరావులకు ఓటింగ్ శాతం చాలా తక్కువగా వచ్చిందని, వీరిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండగా.. ఫైనల్‌గా ఆరోహి, హౌస్‌లో నుండి బయటికి రాబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది. చూద్దాం.. ఏం జరగబోతుందో?.

Who is the First Elimination in Bigg Boss House:

bigg boss telugu season 6 elimination inaya sultana or arohi rao
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs