Advertisement
Google Ads BL

విధి మమ్మల్ని కలిపింది: కత్రినా


కుర్ర హీరో విక్కీ కౌశల్ సీనియర్ హీరోయిన్ కత్రినా తో ప్రేమలో పడడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. వాళ్ళ ప్రేమ విషయం బయటకి చెప్పకపోయినా.. వాళ్ళు లవ్ బర్డ్స్ కింద మీడియాకి చాలా సార్లే దొరికిపోయింది. విక్కీ కౌశల్ కత్రినా ఇంటికి వెళ్లడం చేస్తూ ఉండేవారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్న విషయాన్ని కూడా ఎక్కడా రివీల్ చెయ్యలేదు. అలాగే సెలెబ్రిటీస్ ని కూడా ఆహ్వానించలేదు. కరోనా కారణంగా పెళ్ళికి పిలవలేకపోయామని కత్రినా చెప్పింది. తాజాగా వారిద్దరి కలయిక ఎలా జరిగిందో.. ఎక్కడ నుండి తాము ప్రేమలో పడ్డామో అనే విషయాన్ని కాఫీ విత్ కరణ్ షోలో బయట పెట్టింది కత్రినా కైఫ్.

Advertisement
CJ Advs

జోయా అక్తర్ ఇంట్లో జరిగిన ఓ పార్టీలో విక్కీని కలిసాను అని, అప్పటివరకు విక్కీ కౌశల్ అంటే పేరు మత్రమే తెలుసు. తమని విధి కలిపింది. ఆ పార్టీలోనే ఇద్దరం మాట్లాడుకున్నాం. అప్పుడే తనకి అనిపించింది అతను నా వాడే అని, ఆ తర్వాత చాలా యాదృచ్చికంగా మా మధ్యన జరిగిన సంఘటనలు మమ్మల్ని కలిపింది. కొన్నాళ్ళు డేటింగ్ లో ఉన్నాం. విక్కీ కౌశల్ తన ఫ్యామిలీని చాలా ప్రేమిస్తాడు. అదే సమయంలో నా ఫ్యామిలీని అంతే గౌరవిస్తాడు అంటూ విక్కీతో తన ప్రేమ ఎలా మొదలైందో ఆ షోలో బయట పెట్టింది కత్రినా కైఫ్.

Katrina Kaif about her love story with Vicky Kaushal:

Katrina Kaif opens up about her love story with Vicky Kaushal
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs