Advertisement
Google Ads BL

‘యశోద’ టీజర్: సమంత ఈజ్ బ్యాక్


సమంత నుండి సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది. విడాకుల గొడవ, కాఫీ విత్ కరణ్‌లో ఆమె మాట్లాడిన తీరు, ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే గ్లామర్ ఫొటోలు.. సమంతను నిత్యం వార్తలలో ఉంచుతూనే ఉన్నాయి కానీ.. ఆమె నుండి సినిమా కోసం వేచి చూస్తున్న అభిమానులకు మాత్రం నిరాశ తప్పడం లేదు. వాస్తవానికి ఆమె నటించిన ‘యశోద’, ‘శాకుంతలం’ సినిమాలు రెండూ పూర్తయ్యాయని వినిపిస్తున్నా.. వాటి నుండి ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో.. సమంత పని ఇక అయిపోయినట్లేనా? అందుకే ఆమె సినిమాలు స్పీడందుకోవడం లేదా? అనేలా టాక్ కూడా మొదలైంది. ఇక రూమర్స్ కూడా ఆమెపై గట్టిగానే వినబడుతున్నాయి. ఆ రూమర్స్ అన్నింటికి బ్రేక్ పడాలంటే.. సమంత సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్ అర్జెంట్‌గా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్న టైమ్‌లో.. ‘యశోద’ టీమ్ ఇది అర్థం చేసుకున్నట్లుంది.. వెంటనే ఈ చిత్ర టీజర్‌ని వదిలి.. రూమర్స్ పక్కనెట్టి.. సినిమాల గురించి మాట్లాడుకునేలా చేశారు.

Advertisement
CJ Advs

 

సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యశోద’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలో కూడా ఒకే రోజు విడుదల కానుంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై హరి-హరీష్‌ల దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత ఇంతకు ముందు చేయనటువంటి ఓ వైవిధ్యమైన పాత్రలో చేస్తున్నట్లుగా.. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ తెలియజేసింది. ఇప్పుడు వచ్చిన టీజర్ అయితే.. ఈ సినిమా సమంత కెరీర్‌కి మరింత బూస్ట్ ఇవ్వబోతుందనేలా.. ఆకట్టుకుంటోంది. ఈ టీజర్‌, సినిమాపై భారీగా అంచనాలను పెంచేదిగా ఉంది. 

 

టీజర్ విషయానికి వస్తే.. కట్ చేస్తే హాస్పిటల్‌లో యశోద అనే పేరు నర్సు పిలుస్తుంది.. డాక్టర్ రూమ్‌కి బయట వెయిట్ చేస్తున్న సమంత.. ‘నేనే యశోద’ అన్నట్లుగా చేయి చూపిస్తుంది. అక్కడ కట్ చేస్తే.. యశోదకు ‘కంగ్రాచ్యులేషన్స్.. నువ్వు ప్రెగ్నంట్‌వి’ అంటూ ప్రెగ్నంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ చెబుతూ ఉంటుంది. మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెబితే.. సమంత కడుపులో ఉన్న పిండానికి ఏదో జరిగినట్లుగా చూపించారు. టైమ్‌కి తినాలి.. బాగా నిద్రపోవాలని డాక్టర్ చెబితే.. అసలు నిద్రపట్టక ఇబ్బందులు పడుతున్నట్లుగా చూపించారు. నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని నడవాలి.. అని డాక్టర్ చెబుతుంటే.. సమంతను కుక్క పరిగెత్తించినట్లుగా చూపించారు. ఇంట్లో పని చేయవచ్చు కానీ బరువులు ఎత్తకూడదు, ఏ పని చేసినా దెబ్బ తగలకుండా చూసుకోవాలి, సడెన్‌గా షాక్ అవకూడదు.. భయపడకూడదు, సంతోషంగా.. నవ్వుతూ ఉండాలి అని డాక్టర్ చెప్పిన ప్రతీదానికి అక్కడ రివర్స్‌లో జరుగుతుండటం చూపించారు. మొత్తంగా ఆమె గర్భం నిలబడిందా లేదా? అసలు సమంత విషయంలో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని పెంచేలా.. ఈ టీజర్‌ని కట్ చేశారు. సమంత లైఫ్‌లో భయానక ఇన్సిడెంట్స్ ఉన్నాయని.. అవేంటనేది తెలుసుకోవాలంటే.. ఈ సినిమా కోసం వెయిట్ చేయాలనేలా వచ్చిన ఈ టీజర్ సినిమాపై ఇంట్రస్ట్‌ని పెంచడంతో 100 శాతం సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఈ టీజర్‌కి మరో హైలెట్ మణిశర్మ మ్యూజిక్. మొత్తంగా టీమ్ మొదటి నుండి చెప్పినట్లుగా ఈ సినిమా సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ అనే విషయంతో పాటు.. సమంత ఈజ్ బ్యాక్ అనేలా.. ఆమె గురించి ఇప్పటి వరకు మాట్లాడుకున్న కోణంలో కాకుండా వేరే విధంగా మాట్లాడుకునేలా చేస్తోంది.

టీజర్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Samantha Starring Yashoda Teaser Talk:

Samantha starring Yashoda Movie Teaser Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs