హీరోలయినా, డైరెక్టర్స్ అయినా.. ఒక సినిమా హిట్ అయ్యాక తదుపరి సినిమా సెట్స్ లోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకుంటున్నారు. కారణం కథలు, స్క్రిప్ట్ వర్క్, నటుల ఎంపిక అంటూ ప్రీ ప్రొడక్షన్ లోనే దర్శకులు ఉండిపోతున్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో పుష్ప రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ ఇంతవరకు దాని సీక్వెల్ పుష్ప 2 సెట్స్ మీదకి వెళ్ళలేదు. అయినా అల్లు అర్జున్, సుకుమార్ లు షూటింగ్ చేస్తూనే ఉన్నారు. అల్లు అర్జున్ ఇతర దర్శకులతో యాడ్ షూట్స్ చేస్తూ తెగ సంపాదించేస్తున్నారు. ఇక రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవ్వకముందే మరొక సినిమా మొదలు పెట్టేసాడు. RC15 తో పాటుగా ఓ యాడ్ షూట్ కూడా చేసాడు. అలాగే మహేష్ బాబు కూడా సర్కారు వారి పాట తర్వాత SSMB28 షూటింగ్ కి లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు.
ఈ వారంలోనే త్రివిక్రమ్ తో SSMB28 షూటింగ్ మొదలవుతుంది. ఈ గ్యాప్ లో మహేష్ కూడా ఓ యాడ్ షూట్ కంప్లీట్ చేసేసి భారీగా పారితోషకం అందుకున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ సినిమా షూటింగ్స్ మొదలు పెట్టకుండానే పలు బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్లు కింద పారితోషకాలు బ్యాంకు లో వేసుకుంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం చాలా నష్టపోయాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదు.. అలాగని ఎలాంటి బ్రాండ్స్ ని ప్రమోట్ చెయ్యలేదు. కొరటాలతో NTR30 ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకెళుతుందా అనే ఆత్రుత ఫాన్స్ లో ఉంది. కానీ అటు సినిమా చెయ్యక, ఇటు ఎలాంటి ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చెయ్యకుండా ఎన్టీఆర్ ఖాళీగా ఉండిపోవడంతో ఎన్టీఆర్ కి ఎంత లాస్ వచ్చేసిందో అంటూ ఫాన్స్ తెగ బాధపడిపోతున్నాడు.