Advertisement
Google Ads BL

మీకు బుద్ధి చెప్పే టైం వచ్చింది: అనసూయ


ఈమధ్యన అనసూయ కెరీర్ విషయాల కన్నా ఎక్కువగా నెటిజెన్స్ తో పెట్టుకున్న గొడవే హైలెట్ అయ్యింది. జబర్దస్త్ నుండి బయటికి వచ్చాక మళ్ళీ అంతగా పాపులర్ అయ్యింది నెటిజెన్స్ ఇష్యుతోనే. విజయ్ దేవరకొండ లైగర్ డిసాస్టర్ పై ఇండైరెక్ట్ గా ట్వీట్ చేసి రౌడీ ఫాన్స్ చేతిలో అడ్డంగా బుక్ అయ్యింది. తర్వాత రౌడీ ఫాన్స్ ఆంటీ అంటూ అనసూయని ఆటపట్టిస్తూ రెచ్చగొట్టడంతో అనసూయ కూడా చాలా ఇరిటేట్ అయ్యి చివరికి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. అయినా వారు తగ్గలేదు ఎన్ని కేసులు పెడతావ్, ఎంతమందిని జైలు కి పంపిస్తావ్ అంటూ కామెంట్స్ చేసారు.

Advertisement
CJ Advs

ఈమధ్యన కొద్దిగా గ్యాప్ ఇచ్చిన ఈ గొడవకి అనసూయ రీసెంట్ ట్వీట్ మళ్ళీ ఆజ్యం పోసింది. ఈ రోజు కేరళలో అతి పెద్ద పండగ అయిన ఓనం ఫెస్టివల్ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు చెబుతూ అనసూయ ట్వీట్ చేసింది.

అంతే మరోసారి నెటిజెన్స్ రెచ్చిపోయారు. అనసూయ కంప్లైంట్ ఎంతవరకు వచ్చింది అంటూ క్వచ్చన్ చేసారు ఓ నెటిజెన్. దానికి మరో నెటిజెన్ స్పందిస్తూ.. నీలా మాకు పని పాటా లేదనుకుంటున్నావా అంటూ పోలీస్ లు పంపేసి ఉంటారు అన్నాడు. దానితో అనసూయకి బాగా కాలి.. లేదండి.. మీలా పనీపాటా లేని వాళ్ళకి బుద్ధి చెప్పే టైం వచ్చిందని చెప్పారు. కాస్త ఓపిగ్గా ఉండండి. అన్ని జరుగుతాయి. జరుగుతున్నాయి.. అంటూ ట్వీట్ చేసింది. అసలు మీరు నన్ను అంటి అని పిలిచినందుకు కూడా కాదు, ఆంటీ అంటూ మీరు చేసే రౌడీతనం గురించి.. నా పని తీరును, నా మానసిక ప్రశాంతతను చెడగొట్టేందుకు చేస్తున్న కుట్రకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అంటూ అనసూయ కాస్త వార్నింగ్ ఇచ్చేలా ట్వీట్ చేసింది.

It's time for you to be wise: Anasuya:

Anasuya latest Tweet viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs