Advertisement
Google Ads BL

ఇలియానా మరోసారి ప్రేమలో పడింది


గోవా బ్యూటీ ఇలియానా ఒకప్పుడు సౌత్ లో టాప్ హీరోయిన్ గా మిగతా హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చింది. ఇక్కడ టాప్ గేర్ లో దూసుకుపోతున్న టైం లోనే బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ వరసగా సినిమాలు చేసింది. హిందీ సినిమాలు ఒకటో రెండో సక్సెస్ అయినప్పటికీ.. అక్కడా నిలదొక్కుకోలేకపోయింది. తర్వాత ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్ ఆండ్రుతో ప్రేమాయణం నడిపింది. బ్రేకప్ అయ్యాక డిప్రెషన్ లోకి వెళ్లి సన్నజాజిలా ఉండే ఇలియానా బొద్దుగా తయారైంది. తర్వాత సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా గ్లామర్ షో చేసినా ఇలియానాకి ఆఫర్స్ మాత్రం దక్కడంలేదు.

Advertisement
CJ Advs

ఇప్పుడు ఇలియానా మరోసారి ప్రేమలో పడిందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అది కూడా బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడితో ఇలియానా లవ్ లో ఉందని, వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. కత్రినా సోదరుడు సెబాస్టియన్ తో ఇలియానా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది అని కత్రినా బర్త్ డే సెలెబ్రేషన్స్ లో సెబాస్టియన్ తో పాటుగా ఇలియానా కూడా పాల్గొంది అని అనడమే కాదు, బాంద్రాలోని ఓ అపార్ట్ మెంట్లో ఇలియానా తో పాటుగా సెబాస్టియన్ కలిసి ఉంటున్నట్టు చెపుతున్నారు. మరి ఈ వార్తలపై ఇలియానా ఏమంటుందో చూడాలి.

Has Ileana fallen in love again?:

Ileana in love with Sebastian, Katrina Kaif brother
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs