లైగర్ సినిమా పాన్ ఇండియా మూవీ గా మారడంతో.. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కూడా లైగర్ కి తోడవడంతో పూరి జగన్నాథ్ ఛార్మి తో కలిసి తన మకాం ని ముంబై కి మార్చెయ్యడమే కాదు, అక్కడ ముంబైలో కాస్ట్లీ గా అన్ని సదుపాయాలతో కూడిన ఆఫీస్ ని రెంట్ కి తీసుకున్నాడు. లైగర్ సినిమా ఏడాదిలో పూర్తవుతుంది అనుకుంటే అది కాస్తా కరోనా కారణంగా మూడేళ్లు పట్టింది. దానితో లైగర్ బడ్జెట్ తో పాటుగా పూరి ఆఫీస్ ఖర్చులు కూడా పెరిగిపోయాయి. ముంబై నేపథ్యంలో తెరకెక్కిన లైగర్ కోసం పూరి అక్కడే ఉండాల్సి వచ్చింది. అప్పుడప్పుడు గెస్ట్ లా పూరి జగన్నాథ్ హైదరాబాద్ కి వచ్చి వెళుతుండేవారు.
మరి లైగర్ హిట్ అయితే జన గణ మన కోసం పూరి ముంబైలోని అదే ఆఫీస్ ని కంటిన్యూ చేసేవాడు. కానీ లైగర్ తేడా కొట్టడంతో.. ప్రస్తుతం జన గణ మన ఆగిపోయే పరిస్థితి వచ్చింది. పూరి అటు ఆఫీస్ ఖర్చులు ఎక్కువడంతో ముంబై లోని తన ఆఫీస్ ని ఖాళీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. నెలకి దాదాపుగా 10 లక్షలు అద్దె కడుతున్న పూరి.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంత డబ్బు కట్టడం భారంగా మారడంతో ఆయన అక్కడి ఆఫీస్ ని ఖాళీ చేసి హైదరాబాద్ కి షిట్ అవ్వాలని చూస్తున్నట్లుగా సోషల్ మీడియా టాక్.