Advertisement
Google Ads BL

బిగ్ బాస్ వల్ల ఒరిగిందేమి లేదు: సన్నీ


ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ పరిస్థితి, బిగ్ బాస్ విన్నర్స్ పరిస్థితి ఒకేలా ఉంది. కప్పట్టుకుని కాలర్ ఎగరేసినా.. అందులోకి వెళ్లి మొదటి వారమే బయటికి వచ్చినా.. ఇద్దరిది సేమ్ పొజిషన్. విన్నర్ అయ్యాక హడావిడి చేసి యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ హంగామా చేసినంతసేపు ఉండడం లేదు వారి క్రేజ్ పోవడానికి. విన్నర్ అయిన కొత్తల్లో హడావిడిగా సినిమాలు ఒప్పేసుకోవడమే కానీ.. దాని వలన వారికి ఎలాంటి లాభం ఉండడం లేదు. సీజన్ 1 విన్నర్ శివబాలాజీ దగ్గర నుండి.. నిన్నగాక మొన్న సీజన్ 5 విన్నర్ విజె సన్నీ వరకు అందరూ ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. అక్కడికెళితే ఏదో ఆఫర్స్ వస్తాయి. క్రేజ్ వస్తుంది అనుకుని ఎగిరెగిరి పడినవారు ఇప్పుడు బిగ్ బాస్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

స్వయానా బిగ్ బాస్ విన్నర్ సన్నీనే బిగ్ బాస్ విన్నర్ అయ్యి నేను సాధించింది ఏం లేదు అని చెప్పడం గమనార్హం. ఆ సీజన్ లో షణ్ముఖ్ విన్నర్ అవ్వబోయి.. అదృష్టం కొద్దీ సన్నీ విన్నర్ అవతారమెత్తాడు. బయటికొచ్చాక సన్నీ మాములు హడావిడి చెయ్యలేదు. ఒకటి రెండు ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నాడు. తర్వాత బిజీ అయ్యాడని అనుకున్నారు. కానీ బిగ్ బాస్ సీజన్ 6 మొదలయ్యే ముందు బిగ్ బాస్ వలన ఏం ఒరగదు, ఎక్కడికైనా వెళ్లి బిగ్ బాస్ విన్నర్ ని అని చెబితే.. బిగ బాసా.. అంటే ఏమిటి అని అడుగుతున్నారు. బిగ్ బాస్ వల్ల తనకి పేరు వచ్చిన మాట వాస్తవమే.. కానీ చాలామందికి ఆ విషయమే తెలియదని చెబుతున్నారు. ఓ పెద్ద డైరెక్టర్ కూడా తనని ఇలాగే అడిగారని.. అందుకే అప్పటినుండి తాను బిగ్ బాస్ విన్నర్ అని చెప్పుకోవడం మానేసి.. సీరియల్స్ చేశా.. సినిమాలు చేశా అని చెప్తున్నా అని, జస్ట్ సన్నీ అని మాత్రమే చెప్పుకుంటున్నా అంటూ బిగ్ బాస్ పై సన్నీ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

Bigg Boss has nothing to do with it: VJ Sunny:

Bigg Boss 5 Winner VJ Sunny Shocking Comments on Bigg Boss
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs