అచ్చ తెలుగందం ఈషా రెబ్బా పెళ్లి పీటలెక్కబోతుందట. అందులో నిజమెంతుంతో తెలియదు కానీ.. ఈషా రెబ్బా ఓ స్టార్ డైరెక్టర్ ని వివాహం చేసుకోబోతుంది అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న ఈషా రెబ్బా ఒకప్పుడు చాలా ట్రెడిషనల్ గా పద్దతిగా కనిపించేది. ట్రెడిషనల్ గా ఉంటే అవకాశాలు రావన్న ఈషా రెబ్బా సోషల్ మీడియా వేదికగా గ్లామర్ చూపించడానికి రెడీ అయ్యింది. సోషల్ మీడియాలో మోడరన్ డ్రెస్సులతో అందాలు ఆరబొయ్యడానికి రెడీ అయినా.. ఈషా రెబ్బ కి అవకాశాలు దొరకడం లేదు.
అటు డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద కూడా ఆమెకి అవకాశాలు తగ్గడంతో ఫైనల్ గా పెళ్ళికి రెడీ అయినట్లుంది పాప. ఈమె ఓ తమిళ డైరెక్టర్ తో లవ్ ఉంది అని తెలుస్తుంది. ఆ తమిళ డైరెక్టర్ అక్కడ మంచి మంచి సినిమాలతో పాపులర్ అయినవాడేనట. వీరి ప్రేమ వ్యవహారాన్ని ఇరువురు తమ ఫామిలీస్ కి చెప్పి ఒప్పించారని వారి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారని జోరుగా ప్రచారం సాగుతోంది. వారి పెళ్లి ముచ్చట బయటికి రాగానే.. ఈషా రెబ్బాని పెళ్లి చేసుకోబోయే ఆ తమిళ డైరెక్టర్ ఎవరబ్బా అని ఆరాలు తీసే పనిలో పడ్డారు జనాలు.