Advertisement
Google Ads BL

గాడ్ ఫాదర్ స్పెషల్ అప్ డేట్


మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ గా అక్టోబర్ 5 దసరా స్పెషల్ గా దిగబోతున్నారు. అయితే దసరా కి చిరు రాకపోవచ్చేమో అనే అపోహలకు, అనుమానాలకు గాడ్ ఫాదర్ టీం చెక్ పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గాడ్ ఫాదర్ అక్టోబర్ 5 నే అంటూ అప్ డేట్ ఇచ్చారు. అయితే గాడ్ ఫాదర్ లుక్ లో మెగాస్టార్ చిరు ని చూసిన మెగా ఫాన్స్ ఎగ్జైట్ అయ్యారు. ఇంతకుముందే రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ లుక్, టీజర్ ఫాన్స్ కి బాగా ఎక్కేశాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా గాడ్ ఫాదర్ లో భాగమవడంతో మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. హిందీలోనూ రిలీజ్ చేస్తూ అక్కడ గాడ్ ఫాదర్ హడావిడి మొదలు పెట్టాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. అందుకే గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని రెండు చోట్ల భారీగా ప్లాన్ చేస్తున్నారట.

Advertisement
CJ Advs

అందులో ఒకటి అనంతపూర్ లో గాడ్ ఫాదర్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు. వేలాదిమంది హాజరయ్యే ఏ ఈవెంట్ కి గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరో ఈవెంట్ ని ముంబై వేదికగా ప్లాన్ చేస్తున్నారట. దానికి గెస్ట్ గా సల్మాన్ ఖాన్ ని రప్పిస్తారట. ఎలాగూ గాడ్ ఫాదర్ లో కీ రోల్ ప్లే చేస్తున్న సల్మాన్ ఖాన్ ఈ ఈవెంట్ లో స్పెషల్ హైలెట్ గా నిలుస్తారని అంటున్నారు. నయనతార చిరు కి సిస్టర్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో అనసూయ, సత్యదేవ్ లు కీలక పాత్రలు చేస్తున్నారు.

Chiranjeevi Godfather pre release to have powerful guest:

Godfather Pre Release Event update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs