Advertisement
Google Ads BL

అలియా భట్ కి ఘోర అవమానం


అలియా భట్ - రణబీర్ కపూర్ నటించిన పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర రేపు శుక్రవారమే విడుదల కాబోతుంది. సోషల్ మీడియాలో బ్రహ్మాస్త్ర పై తీవ్రమైన వ్యతిరేఖత ఉంది. ప్రతి రోజు #BoyCottBrahmastra, #BoyCottAliaBhatt హాష్ టాగ్స్ యూనిట్ కి నిద్ర రానివ్వడం లేదు. అయినప్పటికీ బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ తో ఆ నెగెటివిటీని పోగేట్టేందుకు అలియా భట్, రణబీర్ కపూర్, ఆయన్ ముఖర్జీ లు ట్రై చేస్తున్నారు. అలియా భట్ ప్రెగ్నెంట్ అయినప్పటికీ.. ఆమె హుషారుగా ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. కానీ ఆమెపై నెటిజెన్స్ ఇంకా ఇంకా కోపం ప్రదర్శిస్తూనే ఉన్నారు.

Advertisement
CJ Advs

ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు.. బయట కూడా అలియా భట్ పై కొంతమంది మండిపడుతున్నారు. రీసెంట్ గా బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ తో కలిసి రణబీర్ కపూర్, అలియా భట్ లు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వర దర్శనానికి వెళ్లారు. కానీ అలియా భట్ ని రణబీర్ కపూర్ ని గుడిలోపలికి వెళ్లకుండా భజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కారణం గతంలో అలియా భట్ తనకి బీఫ్ ఇష్టమని, బీఫ్ తింటానని చెప్పడమే. అంతేకాకుండా కొన్ని రోజుల కిందట రణబీర్ కపూర్ కూడా తాను మటన్, చికెన్ తో పాటు బీఫ్ కూడా తింటానని చెప్పాడు. ఆ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో.. గుడికి దర్శనానికి వచ్చిన ఈ జంటని నల్ల జెండాలతో అడ్డుకుని వారిపై భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అలియా భట్ ఉజ్జయిని మహాకాళేశ్వర దర్శనానికి వెళుతున్నట్టుగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చూసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు ముందుగానే గుడికి చేరుకొని నిరసనలు చేపట్టారు.

Bajrang Dal stops Ranbir Kapoor and Alia Bhatt:

Bajrang Dal stops Ranbir Kapoor and Alia Bhatt from entering Ujjain temple
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs