Advertisement
Google Ads BL

విజయ్-హరీష్ కాంబో బిగ్ ప్లాన్


లైగర్ మూవీ డిసాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ తో సెట్స్ మీదకి తీసుకెళ్లిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ జన గణ మన ని హోల్డ్ లో పెట్టెయ్యడం కాకుండా ఆపేసాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కాన్సంట్రేషన్ అంతా శివ నిర్వాణతో చేస్తున్న లవ్ స్టోరీ ఖుషి మీదే పెట్టాడంటున్నారు. ఆతర్వాత విజయ్ దేవరకొండ సుకుమార్ తో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయినా.. దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. కొత్తగా ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

Advertisement
CJ Advs

హరీష్ శంకర్ అటు పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చెయ్యాల్సి ఉండడంతో హరీష్ శంకర్ ఈలోపు విజయ్ దేవరకొండ ఓ మూవీ ప్లాన్ చేసాడని అంటున్నారు. హరీష్ శంకర్-విజయ్ దేవరకొండ కలయికలో భారీ బడ్జెట్ తోనే సినిమా చేయబోతున్నారని, దీనికోసం బిగ్ ప్లాన్స్ కూడా చేస్తున్నట్టుగా టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. దీనితో బాక్సాఫీసు లెక్కలు మారిపోవడం ఖాయమని అంటున్నారు.

Vijay Devarakonda-Harish Shankar for a box office attack:

Vijay Devarakonda-Harish Shankar planning a biggie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs