Advertisement
Google Ads BL

ప్రాజెక్ట్ కే లో నా పాత్ర అదే: సింగీతం


అశ్విని దత్ నిర్మాతగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K షూటింగ్ కొత్త షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో మొదలు కావాల్సి ఉంది. ఇంటర్నేషనల్ స్టాండెడ్స్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K లో దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్స్ గా నటించడం, అమితాబ్ కీలక పాత్రలో కనిపించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇలాంటి ప్రాజెక్ట్ లో లెజెండరీ డైరెక్టర్ సింగీతం కూడా భాగం కావడం అందరిలో ఆశ్చర్యాన్ని, ఆసక్తిని కలుగజేసింది.

Advertisement
CJ Advs

92 ఏళ్లలోనూ ఎంతో యాక్టీవ్ గా, హుషారుగా సెన్సాఫ్ హ్యూమర్ తో ఉండే సింగీతం శ్రీనివాస్ గారు తాజాగా అలీ తో సరదాగా షో కి గెస్ట్ గా వచ్చి.. ఆయన పర్సనల్ విషయాలతో పాటుగా సినిమా విషయాలను పంచుకున్నారు. తాను ఇంకా ఇంత హుషారుగా ఉండడానికి కారణం సెన్సాఫ్ హ్యూమర్ అని, తన తండ్రి తనకి వారసత్వంగా ఇచ్చిన ఆస్తి అదే అంటూ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడిన ఆయన్ని అలీ.. అశ్విని దత్ గారు ప్రాజెక్ట్ K కి మెంటర్ గా ఉండమనడానికి కారణం ఏమిటి.. ప్రాజెక్ట్ కే లో మీ పాత్ర ఏమిటి అని అడగగా.. ప్రాజెక్ట్ K స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి ఇచ్చాను. ఆ ప్రాజెక్ట్ లో నా పాత్ర అంతే అంటూ ప్రభాస్ ప్రాజెక్ట్ K పై ఆసక్తికరంగా స్పందించారు సింగీతం శ్రీనివాస్. 

Singeetam Srinivas about Project K:

Singeetam gives clarity about his involvement in Project K
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs