ప్రస్తుతం బాలీవుడ్ కి ఊపిరి కూడా ఆడడం లేదు. ఒకపక్క సినిమాల డిజాస్టర్స్, మరోపక్క నెటిజెన్స్ నెగిటివిటి మధ్యన బాలీవుడ్ నలిగిపోతుంది. ఇప్పుడు బాలీవుడ్ కి మరో గండం పొంచి ఉన్నట్టే కనబడుతుంది వ్యవహారం. ఎందుకంటే బ్రహ్మాస్త్ర కి సెన్సార్ అయ్యింది. దానితో దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబెర్ గా చెప్పుకునే ఉమైర్ సంధూ తన రివ్యూని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఉమైర్ సంధూ ఇచ్చే రివ్యూలు అనుకున్నవి అనుకున్నట్టుగా జరక్కపోయినా.. బ్రహ్మాస్త్ర యూనిట్ లో ఎక్కడో ఏదో ఒణుకు కనిపిస్తోస్తుంటే.. ఆలియా భట్ అభిమానులు, రణబీర్ కపూర్ అభిమానులు ఆ రివ్యూ పట్టించుకోవద్దు అంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యన వచ్చిన లైగర్ రివ్యూ లో ఆహా ఓహో అంటూ రాసాడు. అది కాస్తా డిసాస్టర్ అయ్యింది.
ఇప్పుడు బ్రహ్మాస్త్ర కి తనదైన శైలిలో రివ్యూ ఇస్తూ ఇలాంటి ఫాంటసీ, అడ్వెంచర్ సినిమాలు బాలీవుడ్ లో చాలా తక్కువగా వస్తుంటాయని, ఇలాంటి సినిమాను తెరకెక్కించినందుకు అయాన్ ముఖర్జీని ప్రశంసించాల్సిందేనని చెప్పాడు. కానీ బ్రహ్మాస్త్ర స్టోరీ, స్క్రీన్ ప్లే యావరేజ్ గా ఉన్నాయని, కొన్ని చోట్ల గజిబిజీ గందరగోళంగా అనిపించింది అన్నాడు. ఇక హీరోయిన్ అలియా భట్ స్టన్నింగ్ పెరఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.. హీరో రణ్ బీర్ కపూర్ మాత్రం చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాడని చెబుతూ ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూ తో బ్రహ్మాస్త్ర తో బాలీవుడ్ కి మరో పరాభవం తప్పేలా లేదు అని కొంతమంది అంటుంటే.. కొంతమంది మాత్రం ఉమైర్ సంధు చెప్పిన రివ్యూ తో జెడ్జ్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు అంటున్నారు.