నందమూరి వారసుడు, స్టార్ హీరో బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ఇంకా ఇంకా ఉత్కంఠ పెరుగుతూనే ఉంది, సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎప్పుడో మూడేళ్ళ క్రితం బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినిమా రంగ ప్రవేశంపై చెప్పారు. బాలయ్య బర్త్ డే రోజున మోక్షజ్ఞ సినిమా రంగంలోకి త్వరలోనే ఎంట్రీ ఇస్తాడు అని.. ఆదిత్య 369 సీక్వెల్ తో మోక్షు ఎంట్రీ ఉండబోతున్నట్టుగా చెప్పి అందరిలో క్యూరియాసిటీ పెంచేశారు. అప్పటినుండి మోక్షజ్ఞ ఎంట్రీ ఇదిగో, అదిగో అంటూ ప్రచారం మాత్రం ఆగడం లేదు. కానీ మోక్షజ్ఞ మాత్రం సినిమాలపై ఇంట్రెస్ట్ లేనివాడిలా బరువు పెరిగిపోతున్నాడు. హీరోగా ఎంట్రీ ఇవ్వాలంటే సన్నబడి స్లిమ్ గా తయారవ్వాలి.
నేడు మోక్షజ్ఞ బర్త్ డే. దానితో నందమూరి ఫాన్స్ మరోసారి ఆయన సినిమా ఎంట్రీపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే.. సోషల్ మీడియాలో అసలు మోక్షజ్ఞ వెండితెరపైకి వచ్చే సినిమా ఎలా ఉండాలి అనుకుంటున్నారు. అది మాస్ సినిమా? లేదా క్లాస్ సినిమానా? లేదా ఫ్యామిలీ ఎంటర్టైనర్? అంటూ ఫజిల్స్ పెడుతున్నారు. నేడు సెప్టెంబర్ 6 మోక్షు బర్త్ డే రోజున ఆయన సినీ రంగ ప్రవేశంపై ఏ చిన్న అప్ డేట్ ఇచ్చినా నందమూరి ఫాన్స్ దానిని వైరల్ చేసి ఆయనకి ట్రీట్ ఇచ్చేవారు. కానీ ఈ పుట్టిన రోజునాడు కూడా ఫాన్స్ ని డిస్పాయింట్ చేసారు. త్వరలోనే మోక్షు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటూ ఆయనకి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. సినీజోష్ టీం తరపున మనమూ మోక్షజ్ఞని విష్ చేసేద్దాం. సినీజోష్ టీం తరపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే మోక్షజ్ఞ.