పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో అవకాశం వస్తే ఏ హీరోయిన్ మాత్రం ఎగిరి గంతెయ్యదు. ఇప్పుడు అదే చేస్తుంది కోలీవుడ్ హాట్ బ్యూటీ మాళవిక మోహన్. ప్రభాస్ - మారుతీ కాంబోలో తెరకెక్కబోయే మూవీలో మాళవిక మోహన్ వన్ అఫ్ ద హీరోయిన్ అంటున్నారు. రీసెంట్ గానే పూజా కార్యక్రమాలతో మొదలైన ప్రభాస్-మారుతి ప్రాజెక్ట్ నవంబర్ నుండి రెగ్యులర్ షూట్ కి వెళ్లబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా టైటిల్ రాజా డీలక్స్ గా ప్రచారం జరుగుతుండగా.. ఈ సినిమాలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తాడని తెలుస్తుంది.
ఇప్పుడు మాళవిక మోహన్ ప్రభాస్ తో పని చెయయడానికి చాలా ఉత్సాహాన్ని చూపించడమే కాదు, ఎగ్జైట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడెప్పుడు రాజా డీలక్స్ సెట్స్ లోకి వెళదామా అని ఆమె వెయిట్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో యూత్ కి కునుకు లేకుండా చేస్తున్న మాళవిక మోహన్ గ్లామర్ డోస్ ప్రభాస్ సినిమాలో ఎలా ఉండబోతుంది అనే ఆశక్తి ఆమె అభిమానుల్లోనూ మొదలయ్యింది. అయితే మాళవిక మోహన్ ప్రభాస్-మారుతి సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయినట్లుగా అధికారిక ప్రకటన మాత్రం లేదు.