Advertisement
Google Ads BL

చంద్రబాబు-మోహన్‌బాబు కలిసింది అందుకేనా?


కొన్ని రోజుల క్రితం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని.. కలెక్షన్ కింగ్‌ మోహన్‌ బాబు, మంచు లక్ష్మీతో సహా వెళ్లి కలిసిన విషయం తెలిసిందే. అంతకుముందు టీడీపీ అధికారంలో ఉండగా.. చంద్రబాబుని ధూషించడమే కాకుండా.. ఎప్పుడూ ఆయనని ఏదో ఒకటి అనడమే మోహన్ బాబు పనిగా పెట్టుకున్నాడు. టీడీపీ నుండి మోహన్ బాబు వైసీపీకి వెళ్లిన తర్వాత ఇదంతా జరిగింది. అయితే బాబుని ఎంతగా ధూషించినా.. మోహన్ బాబు అండ్ ఫ్యామిలీకి అంతగా వైఎస్ జగన్ ప్రయారిటీ ఇవ్వలేదు. అయినా వైసీపీలోనే ఉన్న మోహన్ బాబు.. సడెన్‌గా చంద్రబాబుని కలవడంతో రాజకీయంగా వార్తలు వైరల్ అయ్యాయి. వారి భేటీకి కారణం ఏమై ఉంటుంది? మళ్లీ మోహన్ బాబు టీడీపీ గూటికి రాబోతున్నారా? అనేలా వార్తలు వ్యాప్తిస్తున్న నేపధ్యంలో.. తన శ్రీవిద్యానికేతన్ స్కూల్స్‌లో స్థాపించిన సాయిబాబా గుడి ఓపెనింగ్‌కి ఆహ్వానించడానికే.. బాబుని కలిసినట్లుగా మోహన్ బాబు చెప్పుకొచ్చారు. 

Advertisement
CJ Advs

 

అయితే, ఆయన అంతగా చెప్పినా.. ఎక్కడో, ఏదో తేడా కొడుతూనే ఉంది కానీ.. ఆ తర్వాత మీడియా కూడా ఈ విషయంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు మంచు మనోజ్ రెండో పెళ్లి అంటూ బయటికి వచ్చిన వార్తలతో.. ఆ రోజు చంద్రబాబుని మోహన్‌బాబు కలవడానికి కారణం ఇదే అయి ఉంటుందనేలా ఇప్పుడు టాక్ మొదలైంది. మంచు మనోజ్.. భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికా రెడ్డితో కలిసి సీతాఫల మండి వద్ద గల గణేష్ మండపంలో పూజలు నిర్వహిస్తున్న ఫోటోలు ఆదివారం సోషల్ మీడియాని షేక్ చేశాయి. ఈ ఫొటోలలో వారిద్దరిని చూసిన వారంతా.. మౌనికాను మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడనేలా మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం మనోజ్‌ని అడిగితే.. ఇప్పుడు సందర్భం కాదని అనడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చినట్లయింది. ఇక ఈ ఫోటోల తర్వాత.. ఆరోజు చంద్రబాబుని మోహన్ బాబు కలవడానికి కారణం ఈ రెండో పెళ్లి గురించే అయి ఉంటుందనేలా టాక్ మొదలైంది. అందుకు కారణం.. భూమా ఫ్యామిలీ తెలుగు దేశం పార్టీలో ఉండటమే కాకుండా.. చంద్రబాబు మాటకి ఎదురు చెప్పరు కాబట్టే.. మోహన్ బాబు అటు నుండి ప్రయత్నాలు చేసినట్లుగా ఇప్పుడంతా టాక్ స్ప్రెడ్ అవుతోంది. అయితే, ఇప్పటి వరకు ఈ వార్తలపై మంచు ఫ్యామిలీకానీ, అటు భూమా ఫ్యామిలీ కానీ రియాక్ట్ కాకపోవడంతో.. మౌనికతో మనోజ్ పెళ్లి నిజమేనని ఇండస్ట్రీ వర్గాలలో కూడా అనుకుంటున్నారు.

Rumours on Chandrababu and Mohan Babu Meet:

Mohan Babu meets Chandrababu for Manchu Manoj Second Marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs