Advertisement
Google Ads BL

‘పిల్లి’.. మహేష్‌ బాబుకి షాకిచ్చిన సితార!


సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూతురు సితార షాకిచ్చింది. అదెలా అనుకుంటున్నారా? వీరిద్దరూ కలిసి.. జీ తెలుగులో ప్రసారమవుతున్న ఓ డ్యాన్స్ షో‌కి గెస్ట్‌గా హాజరైన విషయం తెలిసిందే. వారిద్దరూ ఈ ఈవెంట్‌కి హాజరైన ఫొటోలు, క్లిప్పింగ్స్ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా.. టాప్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారిపోయాయి. ఎందుకంటే, ఇది ఎవరూ ఊహించనటువంటి పరిణామం. తన కుమార్తెతో కలిసి మహేష్ బాబు బుల్లితెరపై జరిగే ఓ షోకి గెస్ట్‌గా వస్తాడని ఎవరైనా ఊహించి ఉంటారా? కానీ దీనిని నిజం చేశారు. 

Advertisement
CJ Advs

 

ఇక విషయంలోకి వస్తే.. ఈ షోలో సితార ఓ పజిల్ అడిగింది. దానికి షోలో ఉన్న ఒక్కరు కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఇంతకీ సితార ఏమని అడిగిందంటే.. ‘‘క్యాట్ డ్రింక్స్ హాట్ మిల్క్ సమ్ ఏ బౌల్.. వాట్ హ్యాపెన్?’’. అంటే ‘పిల్లి ఒక గిన్నెలోని వేడి వేడి పాలు తాగితే ఏమవుతుంది?’ అనేది సితార క్వశ్చన్. దీనికి అందరూ తెల్లముఖాలు వేశారు. మహేష్ కలగజేసుకుని.. ‘పిల్లి మూతి కాలుపొద్ది’ అని సమాధానమిచ్చారు. అందుకు సితార.. తెలుగులో ‘కాదు’ అని సమాధానమిచ్చింది. ‘మూతి కాలిపొద్దమ్మా’ అని మరోసారి మహేష్ చెప్పడం.. ‘కాదు’ అని సితార అనడం మళ్లీ ఓసారి రిపీటయ్యింది. ఆ తర్వాత సైడ్ నుండి ‘కడుపు నిండిపొద్ది’ అని ఒకరు సమాధానం చెప్పినా.. సితార కాదని అంది. దీంతో నువ్వే చెప్పు అని మహేష్ అడుగగా.. ‘బౌల్ ఖాళీ అయిపోతది’ అని సితార ఇచ్చిన ఆన్సర్‌కి మహేష్ తల పట్టేసుకున్నాడు. అక్కడున్నవారంతా ఒకటే నవ్వులు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ సరదా వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Sithara Cat Question To Mahesh Babu Creates Sensation:

Sithara question Mahesh Babu expression
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs