Advertisement
Google Ads BL

బిగ్ బాస్6: ఫేస్ లు కనబడకుండా ప్రోమో కట్


బిగ్ బాస్ 6 స్టార్ మార్ మా లో మొదలు కావడానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి బిగ్ బాస్6 హడావిడి స్టార్ మా లో మొదలు కాబోతుంది. దానితో బుల్లితెర ప్రేక్షకుల ఇంట్రెస్ట్ కూడా ఎక్కువైంది. కొంతమంది సెలబ్రిటీస్ హౌస్ లోకి వెళుతున్నట్టుగా పేర్లు బయటకి వచ్చినా.. ఇంకా ప్రేక్షకుల్లో ఏదో ఆత్రుత కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 6 ఎంట్రీ ఎపిసోడ్ షూట్ కొనసాగుతుంది. నాగార్జున హోస్ట్ గా మొదలవుతున్న సీజన్ 6 బిగ్ బాస్ గ్రాండ్ ఓపెంగ్ ఎపిసోడ్ ప్రోమోని వదిలారు. అందులో కొంతమంది హౌస్ లోకి ఎంటర్ అవుతున్న వారిని ఫేస్ లు కనిపించకుండా నాగ్ ని చూపిస్తూ కవర్ చేసారు. బిగ్ బాస్ హౌస్ సెట్ ని చూపించిన తర్వాత కొంతమంది కంటెస్టెంట్స్ ని పరిచయం చేసినా ఫేస్ రివీల్ అవ్వలేదు.

Advertisement
CJ Advs

కానీ వాళ్ళ వాయిస్ ని బట్టి సింగర్ రేవంత్ అయితే పక్కాగా హౌస్ లోకి వెళ్ళాడు. ఎందుకు సర్ ఇవన్నీ మా ఆవిడా చూస్తుంది అంటూ మాట్లాడుతూ రేవంత్ కన్ ఫర్మ్ అయ్యాడు. తర్వాత జబర్దస్త్ చలాకి చంటి కూడా రాజు గెటప్ లో మొహం కనిపించకుండా మాటలతోనే దొరికేసాడు. ఇంకా బుల్లితెర నటి మెరీనా కూడా నాగ్ తో మట్లాడుతూ దొరికిపోయింది. కొంతమంది మాట్లాడినా వారిని ఆడియన్స్ కూడా గుర్తుపట్టలేదు. అంటే సాయంత్రానికి కానీ వారెవరో క్లారిటీ రాదు.

సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్ 6 లోకి ఎంట్రీ ఇవ్వబోయే కంటెస్టెంట్స్ ప్రచారంలో ఉన్న లిస్ట్ మీ కోసం 

1. సింగర్ రేవంత్ 

2. ఆర్జే సూర్య 

3. రోహిత్- మెరీనా (కపుల్స్)

4. హీరో అర్జున్ కళ్యాణ్ 

5. బాలాదిత్య 

6.మోడల్ రాజశేఖర్ 

7. జబర్దస్త్ చలాకీ చంటి 

8. శ్రీహాన్ 

1. సుదీప 

2. ఇనయ సుల్తాన-ఆర్జీవీ హీరోయిన్ 

3. జబర్దస్త్ ఫైమా 

4. అభినయ శ్రీ 

5.యాంకర్ ఆరోహి రావ్ అలియాస్ ఇస్మార్ట్ అంజలి 

6. సీరియల్ నటి శ్రీ సత్య 

7. కీర్తి భట్ 

8. వాసంతి కృష్ణన్ 

9. యాంకర్ నేహా చౌదరి 

10. గలాటా గీతు 

Bigg Boss 6: Opening Episode promo :

Bigg Boss 6: Opening Episode promo goes viral 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs