Advertisement
Google Ads BL

సోషల్ మీడియాకి చిన్న బ్రేక్: ఛార్మి


లైగర్ డిసాస్టర్ ఎఫెక్ట్ పూరి కనెక్ట్స్, ఛార్మి సోషల్ మీడియాకి బ్రేక్ ప్రకటించేలా చేసింది. పూరి-ఛార్మి కలిసి పూరి కనెక్ట్స్ పేరుతొ నిర్మాణ సంస్థని నడుపుతున్న విషయం తెలిసిందే. లైగర్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని దడదడ లాడిద్దామనుకుంటే.. లైగర్ మూవీ ప్లాప్ టాక్ పూరి కనెక్ట్స్ ని కదిలించింది. దానితో ఛార్మి, పూరి సైలెంట్ అయ్యారు. లైగర్ లాస్ పూడ్చే పనిలో పడ్డారు. ఈలోపు హీరో విజయ్ దేవరకొండ పూరి తో చేస్తున్న నెక్స్ట్ ప్రొజెక్ట్ జన గణ మన విషయంలో అసంతృప్తితో ఉన్నాడనే టాక్ మొదలయ్యింది. దానితో పూరి జగన్నాథ్ తన డ్రీం ప్రాజెక్ట్ జన గణ మన ని ఆపేస్తున్నాడనే కామెంట్స్ రేజ్ అయ్యాయి.

Advertisement
CJ Advs

ఇప్పుడు లైగర్ దెబ్బకి ఛార్మి కూడా సోషల్ మీడియాకి విరామం ప్రకటించింది. జస్ట్ విరామం మాత్రమే.. పూరి కనెక్ట్స్ మళ్లీ బ్యాక్ బౌన్స్ అవుతుంది. మంచి ప్రాజెక్టు తో మళ్లీ మొదలు పెడతాం.. అప్పటివరకు మీరు హ్యాపీగా ఉండండి.. మమ్మల్ని హ్యాపీ గా బ్రతకనివ్వండి అంటూ ఛార్మి ట్వీట్ చేసింది. 

Chill guys! 

Just taking a break 

( from social media )

@PuriConnects

 will bounce back 😊

Bigger and Better... 

until then, 

Live and let Live ❤️

అంటూ సోషల్ మీడియాలో ఛార్మి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

Liger effect: Puri Jagannath and Charmy Kaur on a break:

Liger forces Puri Jagannath and Charmy Kaur to break
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs