పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో మోస్ట్ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటరైనర్ సలార్ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ప్రభాస్ చేయించుకున్న చిన్న సర్జరీ వలన షూటింగ్ నుండి కొద్దిగా బ్రేక్ తీసుకున్నారు. సలార్-ప్రాజెక్ట్ కె షూటింగ్స్ ని ఒకేసారి చేస్తున్న ప్రభాస్.. కొత్త షెడ్యూల్స్ లో ఎప్పుడు పాల్గొంటారో తెలియదు కానీ.. సలార్ నుండి ఓ చిన్నపాటి VIOLENT అప్ డేట్ వచ్చింది సలార్ ట్విట్టర్ హ్యాండిల్ లో వైలెంట్ అంటూ ఏదో మెసేజ్ ఇస్తున్నట్టుగా పెట్టారు. అది సలార్ కొత్త షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నామని చెప్పారా..?
ప్రభాస్ ని మోస్ట్ వైలెంట్ గా చూపిస్తున్నామని క్లూ ఇచ్చారా? లేదంటే మారేదన్నా అప్ డేట్ అనేది ప్రభాస్ ఫాన్స్ కి అర్ధం కాకపోయినా.. వారు మాత్రం సలార్ నుండి వచ్చిన ఈ VIOLENT అప్ డేట్ ని షేర్ చేస్తూ లైక్స్ కొడుతూ హంగామా అయితే మొదలు పెట్టారు. మరోపక్క అదే టైం లో KGF మేకర్స్ కూడా MONSTER అంటూ ట్వీట్ చెయ్యడంతో అటు రాఖి భాయ్ ఫాన్స్, ఇటు ప్రభాస్ ఫాన్స్.. ఏమిటి మేటర్ ఒకేసారి రెండు ట్విట్టర్ హ్యాండిల్స్ నుండి అప్ డేట్స్.. రెండిటీకి లింక్ ఏమిటి అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ సలార్-KGF లకి లింక్ పెట్టబోతున్నారా? అనే అనుమానం బయలుదేరింది. రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి ఒకే నిర్మాతలు కావడంతో ఇప్పుడు అందరిలో ఈ VIOLENT, MONSTER ట్వీట్స్ పై క్యూరియాసిటీ మొదలైంది.