Advertisement
Google Ads BL

హరిహర వీరమల్లు: ఇది కదా పండగంటే!


కొన్నాళ్లుగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలైతే చేస్తున్నాడు.. అవి హిట్టవుతున్నాయి.. కానీ, ఆయన అభిమానులకు కావాల్సింది ఏదో మాత్రం మిస్సవుతుంది. అదెంటనేది తాజాగా విడుదలైన ‘హరిహర వీరమల్లు’ పవర్ గ్లాన్స్ చూస్తుంటే తెలిసిపోతుంది. పవన్ కల్యాణ్‌కి ముందు ఉన్న ఆ పవరేంటో చూపించేలా ఉందీ గ్లాన్స్. ఇదే కోరుకుంటుంది ఫ్యాన్స్. అసలు పండగ వారికి ఇప్పుడొచ్చింది.. సంబరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాస్తవానికి 

Advertisement
CJ Advs

 

‘స్వాగతిస్తుంది సమరపథం..

దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం..’ అని ప్రి ఫెస్టివల్ పోస్టర్ వదిలినప్పుడే.. ఏదో సునామీ రాబోతుందని ఫ్యాన్స్‌కి హెచ్చరిక వచ్చేసింది. ఇప్పుడా సునామీ వచ్చేసింది. పవర్ సునామీ ఈ రేంజ్‌లో ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. మల్లయోధులను మట్టి కరిపిస్తున్న వీరమల్లు వీరప్రతాపం ముందు.. ఇప్పుడు సోషల్ మీడియా షేకవుతుంది. అసలు.. సిసలైన పాన్ ఇండియా సినిమాకి అర్థం చెప్పేలా వచ్చిన ఈ గ్లాన్స్.. ఫ్యాన్స్ ఆకలి తీర్చేసింది. ఇది ఫ్యాన్స్ కాలరేగరేసే టైమ్.. దయచేసి ఇప్పుడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ని టచ్ చేయకండి.. తట్టుకోలేరు. 

 

ఈ గ్లాన్స్ చూశాక.. పవన్ కల్యాణ్ అభిమానుల నోటి వెంట ఏమని వినిపిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇన్నాళ్లూ ఏమైపోయావన్నా అంటూ.. దర్శకుడు క్రిష్‌కి దండాలు పెట్టేస్తున్నారు.

‘‘దిగొచ్చింది భళు భళ్ళురా.. పిడుగే, దిగొచ్చింది భళు భళ్ళురా... 

మెడల్ని వంచి.. కథల్ని మార్చి

కొలిక్కితెచ్చే పనెట్టుకొని 

తొడకొట్టాడో.. తెలుగోడు’’ అంటూ వచ్చిన ఈ గ్లాన్స్‌లో ఒక్కో షాట్ అద్భుతం అనే రేంజ్‌లో ఉంది. కీరవాణి ఏం కొట్టిండులే. పవర్ స్టార్‌పై నిర్మాత రత్నం అభిమానం అడుగడుగునా కనబడుతోంది. ఇంక ఆయన బిజినెస్‌కి రెక్కలొచ్చినట్టే. రాసి పెట్టుకోండి.. సమ్మర్‌కి సమరం సిద్ధమైనట్టే. 

హరిహర వీరమల్లు పవర్ గ్లాన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Hari Hara Veera Mallu Power Glance Report:

Pawan Kalyan Hari Hara Veera Mallu Power Glance Out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs