Advertisement
Google Ads BL

జల్సా: థియేటర్ పై పవన్ ఫాన్స్ దాడి


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన జల్సా స్పెషల్ షోస్ తో పవన్ కళ్యాణ్ ఫాన్స్ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు. పవన్ బర్త్ డే సందర్భంగా ఫ్లెక్సీలు కట్టడం, బ్యానెర్లు కట్టడంతో పాటుగా.. జల్సా సినిమా చూసేందుకు పవన్ కళ్యాణ్ ఫాన్స్ జల్సా షోస్ పడుతున్న థియేటర్స్ కి క్యూ కట్టారు. జల్సా అడ్వాన్స్ బుకింగ్ తోనే రికార్డులు కొల్లగొట్టింది. పవన్-త్రివిక్రమ్ కాంబోలో పవన్ - ఇలియానా రొమాన్స్, పవన్ కామెడీ అన్నీ ఇప్పటికే థియేటర్స్ లో, టీవీలో చూసేసినా.. 4K లో జల్సా ని చూసేందుకు పవన్ ఫాన్స్ ఎగబడ్డారు.

Advertisement
CJ Advs

రేపు పవన్ బర్త్ డే అయితే ఈ రోజు కొన్ని థియేటర్స్ లో జల్సా రెండు షోస్ ప్రదర్శించారు. జల్సా షో లో సౌండ్ సిస్టమ్ బాగోలేదంటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ కర్నూల్ లోని శ్రీరామ్ థియేటర్ పై రాళ్ల దాడి చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. జల్సా షోస్ ప్రదర్శితమవుతున్న శ్రీరామ థియేటర్ దగ్గరకు భారీగా చేరుకున్న పవన్ ఫాన్స్.. అక్కడ సౌండ్ సిస్టం బాలేదు అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ రాళ్ల దాడి చెయ్యడంతో.. అక్కడికి పోలీస్ లు చేరుకొని కొంతమంది బైక్స్ ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడమే కాకుండా.. శ్రీరామ థియేటర్ దగ్గర పెద్ద ఎత్తున పోలీస్ లు మోహరించారు. మరి ఫాన్స్ కి అభిమానమైతే ఉండొచ్చు కానీ.. ఇలా థియేటర్స్ పై దాడి చేసేంత ఉండకూడదు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

Pawan fans attack on theater in Kurnool :

Jalsa shoes: Pawan Kalyan fans attack on theater in Kurnool
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs