Advertisement
Google Ads BL

ఫ్లాష్ : దూసుకొచ్చింది వీరమల్లు విజయ రథం


రేపు (2 సెప్టెంబర్ 2022) పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఇప్పటికే జల్సా, తమ్ముడు చిత్రాల స్పెషల్ షోస్ తో రచ్చ రచ్చ చేస్తోన్న పవర్ స్టార్ ఫ్యాన్సు ఉత్సాహాన్ని మరింత పెంచేలా దూసుకు వచ్చేసింది హరి హర వీరమల్లు అప్ డేట్.. తీసుకు వచ్చేసింది అద్దిరిపోయే పోస్టర్ తో అభిమానులకు స్పెషల్ ట్రీట్.

Advertisement
CJ Advs

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని రాబిన్ హుడ్ తరహా పాత్రలో చూపిస్తూ చారిత్రాత్మక నేపథ్యంతో సాగే భారీ పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోన్న హరి హర వీరమల్లుపై ఇప్పటికే హై ఎక్స్ పెక్టేషన్స్ ఉండగా.. వాటికి ధీటుగానే నిలుస్తోంది ఈ స్పెషల్ పోస్టర్.

స్వాగతిస్తోంది సమరపథం.. దూసుకొస్తోంది వీరమల్లు విజయరథం అంటూ..

సత్యం - ధర్మం యొక్క పరాక్రమ రథ సారథిగా తమ హరి హర వీరమల్లు పవన్ కళ్యాణ్ ని అభివర్ణిస్తూ ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది మెగా సూర్య ప్రొడక్షన్స్ సంస్థ. ఇదొక్కటే కాదండోయ్.. ఇంతకు పదింతలు కిక్కునిచ్చే వీడియో బిట్ ని రేపు (02.09.2022) సాయంత్రం 5 :45 కి #powerGlance పేరుతో విడుదల చేస్తామంటూ పవర్ స్టార్ ఫ్యాన్సుని మరింత ఊరిస్తున్నారు చిత్ర దర్శకుడు క్రిష్. సో.. ఇక రేపు సాయంత్రం యూట్యూబ్ లో ఉంటుంది ఊచకోత.!

ఇక హీరోగా పవర్ స్టార్ పవర్ ఏంటనేది మరోమారు నిరూపిస్తూ పవన్ కళ్యాణ్  అభిమానులు  స్పెషల్ షోస్ వైజ్ స్పెషల్ రికార్డ్స్ క్రియేట్ చేసేస్తుంటే.. మరోవైపు జనసేనాని జన్మదిన వేడుకలను పలు సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నారు జన సైనికులు. మొత్తానికి ఎటు చూసినా పవన్ హవానే.. పవన్ హంగామానే.!

Hari Hara Veeramallu New Poster:

Hari Hara Veeramallu New Poster with Birthday Wishes to Pawan Kalyan 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs