Advertisement
Google Ads BL

NTR ఆ సినిమా అంటే ఇప్పటికీ షివరింగ్: చిరు


లెజెండ్ నందమూరి తారక రామారావు నటించిన ఓ చిత్రమంటే.. తనకి ఇప్పటికీ షివరింగ్ వస్తుంటుందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. మాములుగా అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి పెద్ద హీరోలు సంకోచిస్తారు. కానీ ఇన్నాళ్లూ దాచి పెట్టిన ఈ విషయాన్ని.. యాంకర్ సుమ దెబ్బకి చిరు రివీల్ చేయక తప్పలేదు. ఇన్నాళ్లూ ఈ విషయం చెబితే ఎక్కడ పరువు పోతుందో అని చెప్పలేదు.. కానీ ఇప్పుడు చెప్పక తప్పడం లేదంటూ.. తన చిన్నతనంలో జరిగిన ఓ విషయాన్ని చిరంజీవి బయటపెట్టారు. ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ కథ, స్ర్కీన్‌ప్లే అందించిన చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. ఈ సినిమాతో చిరంజీవితో ‘స్వయంకృషి’, ‘ఆపద్భాంధవుడు’ వంటి చిత్రాలు నిర్మించిన అభిరుచి గల నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా పరిచయం అవుతుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 2వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యాంకర్ సుమ.. మీ లైఫ్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవం గురించి చెప్పాలని చిరుని అడిగింది.

Advertisement
CJ Advs

 

తన ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవం గురించి చెబుతూ.. ‘‘నాకు కూడా ఆ అనుభవం ఉంది. అయితే ఎప్పుడూ, ఎక్కడా ఇంత వరకు ఈ విషయం షేర్ చేసుకోలేదు. ఎందుకంటే ఎక్కడ పరువు పోతుందో అని. నెల్లూరులో.. నేనప్పుడు ఆరో, ఏడో చదువుతున్నాను. సంవత్సరం గుర్తు లేదుకానీ.. ఎన్టీఆర్‌గారి సినిమా. సినిమా పేరు ఏవిఎమ్ వారి ‘రాము’. పూర్ణ అని మా చుట్టాలబ్బాయి ఒకడు ఉండేవాడు. వాడికి ఎన్టీఆర్ అంటే ఎనలేని ఇష్టం. వాడితో కలిసి ఆ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లాము. తమ్ముడు నాగబాబు కూడా మాతో పాటు వచ్చాడు. అయితే అప్పటి వరకు నాన్నగారు మమ్మల్ని నేల, బెంచ్ కాకుండా.. కాస్త కుర్చీ రేంజ్‌లోనే సినిమాలు చూపించేవారు. కానీ ఆ రోజు నేలకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ సినిమాకి టిక్కెట్స్ తీసుకొనే క్రమంలో క్యూలో ఇరుక్కుపోయాము. ముందుకు వెళ్లడానికి లేదు.. వెనక్కి పోవడానికి లేదు. ఆ జనానికి నాగబాబుకి ఊపిరి ఆగిపోయేంత పనైంది. మా టైమ్ బాగోక అదే సమయంలో నాన్నగారు.. అంతకుముందు షో చూసి బయటికి వస్తూ.. మమ్మల్ని చూశారు. అప్పటికే నాగబాబు బిక్క ముఖం పెట్టేశాడు. మా పరిస్థితి చూసి.. ఆయన కోపంతో కొబ్బరిమట్టతో అక్కడ మొదలెట్టి.. ఇంటికి వచ్చేవరకు కొడుతూనే ఉన్నారు. అందుకే ఇప్పటికీ ‘ఏవిఎమ్ రాము’ సినిమా అంటే నాకు షివరింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా చెమటలు పట్టేశాయి’’ అంటూ చిరు తన తొలి అనుభవాన్ని సరదాగా షేర్ చేసుకున్నారు.

Megastar Chiranjeevi Shared Interesting Story in his life:

Megastar Chiranjeevi speech at First Day First Show Pre Release Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs