Advertisement
Google Ads BL

అందుకే మా పెళ్ళికి ఎవరిని పిలవలేదు: కత్రినా


కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ లు కొన్నాళ్ళు ప్రేమ పక్షుల్లా తిరిగినా.. ఎక్కడా వారు ప్రేమలో ఉన్నట్లు కానీ, డేటింగ్ లో ఉన్నట్లు కానీ బయటపెట్టలేదు. పెళ్లిని కూడా అంతే సీక్రెట్ గా బాలీవుడ్ లో ఎవరిని ఆహ్వానించకుండానే రాజస్థాన్ లో చేసుకుంది ఈ జంట. పెళ్లి తర్వాత కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ జంట అఫీషియల్ గా మీడియా ముందు  వచ్చింది. పెళ్లి తర్వాత చెట్టలేసుకుని హనీమూన్, బర్త్ డే పార్టీలు అంటూ తిరుగుతున్న విక్కీ కౌశల్-కత్రినాలు రీసెంట్ గా బాలీవుడ్ లో జరిగిన ఫిలిం ఫేర్ అవార్డ్స్ కి హాజరయ్యారు. ఈ జంటను చూస్తే దిష్టి తగులుతుందా అనే ఫీలింగ్ లో బాలీవుడ్ ప్రేక్షకులు ఉన్నారు. అంత అందంగా క్యూట్ గా కనిపించారు ఇద్దరూ.

Advertisement
CJ Advs

ఇక ఈ ఈవెంట్ లో సర్ధార్ ఉదమ్ సింగ్ సినిమాకి ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్ ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నాడు. విక్కీ కౌశల్ ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్న సందర్భంగా కత్రినా కైఫ్ మీడియా తో మట్లాడుతూ తమ పెళ్లిని ఎందుకు సీక్రెట్ గా దాచి పెట్టాల్సి వచ్చిందో చెప్పింది. కరోనా కారణంగానే తమ పెళ్లిని సీక్రెట్ గా చేసుకోవాల్సి వచ్చింది అని, అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి. ఆ సమయంలోనే నా ఫ్యామిలీ కరోనా తో ఇబ్బంది పడింది. మా నుండి కరోనా ఎవరికీ వ్యాప్తి చెందకూడదనే భావనతోనే పెళ్ళికి ఎవరిని పిలవకుండా, సీక్రెట్ గా చేసుకోవాల్సి వచ్చింది. అ సమయంలో నిజంగా కోవిడ్‌తో జాగ్రత్తగా ఉండాలని అనుకున్నాం. కానీ మా వివాహం మాత్రం చాలా గ్రాండ్‌గా, అందంగా జరిగింది. ఆ విషయంలో విక్కీ, నేను ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం అంటూ పెళ్లి విషయాలను మీడియా ముందు పెట్టింది కత్రినా.

Katrina Kaif reveals reason behind Secret Wedding:

Katrina Kaif reveals the real reason behind secret wedding with Vicky Kaushal
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs