కంటెంట్ బావుంటే.. ప్రేక్షకులు సినిమాలు ఎంతగా ఆదరిస్తారో అని చెప్పనికి ఉదాహరణలు.. సీత రామం, బింబిసార, కార్తికేయ 2 అంటూ సినిమా ప్రముఖులే ఒప్పుకుంటున్న నిజం. ఈ మధ్యన మెగాస్టార్ చిరు కూడా ఏ ఈవెంట్ లో కనిపించినా అదే చెబుతున్నారు. అందులోను తనకి ఆచార్య తో అయిన అనుభవాన్ని ఇండైరెక్ట్ గా ప్రస్తావిస్తూ దర్శకుడు కొరటాలకి పంచ్ లు వదులుతున్నారు. తాజాగా ఫస్ట్ డే ఫస్ట్ షో కి గెస్ట్ గా వచ్చిన ఆయన కంటెంట్ బావుంటే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు.. దానికి నిదర్శనం బింబిసార, సీత రామం, కార్తికేయ 2 చిత్రాలే.. మంచి కంటెంట్ తో సినిమా ఇండస్ట్రీకి ఆ చిత్రాలు ఊపిరి పోశాయి. మంచి కథ ఉంటే ఆడియన్స్ వస్తారు. లేదంటే రెండోరోజే ఎత్తేస్తారు. అలాంటి బాధితుల్లో ఈమధ్యన నేను ఒకడిగా మారాను.
ఏ చిత్రనికైనా కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్లు.. అన్నిటికన్నా ముందు ప్రేక్షకులకు ఏది అవసరం, వారికి ఎలా బావుంటుంది అని కథల మీద దృష్టి పెట్టాలి. ముందు మీరు చెయ్యబోయే కథకి ఓ ప్రేక్షకుడిగా భావించి.. ఏముందని ఈ సినిమా చూడాలని ప్రశ్నించుకోండి. అలా కాకుండా డేట్స్ క్లాష్ అవుతున్నాయి అని కంగారు కంగారుగా షూటింగ్స్ చేస్తున్నారు. మీపై ఎందరో ఆధారపడి ఉన్నారని గుర్తుపెట్టుకోండి. కంటెంట్ విషయంలో డైరెక్టర్ అనే వాడు, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలా చేస్తే ఇండస్ట్రీకి ఎక్కువ హిట్సే వస్తాయి. సక్సెస్ ని ఎవరూ ఆపలేరు అంటూ చిరు మాట్లాడింది కొరటాలని దృష్టిలో పెట్టుకునే అంటున్నారు సినీ ప్రేక్షకులు.
మొన్నీమధ్యనే చిరు ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ.. కొంతమంది డైరెక్టర్స్ సెట్స్ కి వచ్చాక డైలాగ్స్ రాసుకుని చెప్పిస్తున్నారు. అలాంటాప్పుడు నటులు ఇబ్బందిపడతారు. అదేదో ముందే చెబితే ప్రాక్టీస్ చేసుకుంటారు. అప్పుడు సీన్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఆలా ఇబ్బంది పడిన వాళ్లలో నేను ఉన్నాను.. ఇకనైనా డైరెక్టర్స్ మారాలి అంటూ సెన్సేషనల్ గా మట్లాడారు. అంటే చిరు పదే పదే కొరటాలనే టార్గెట్ చేస్తూ ఆచార్య పోవడానికి ప్రధాన కారణం కొరటాలే అని చెప్పకనే చెబుతున్నారని నెటిజెన్స్ ఫిక్స్ అవుతున్నారు.