Advertisement
Google Ads BL

డిసాస్టర్ సినిమాకి అమీర్ సంచలన నిర్ణయం


బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ తీసుకు వచ్చే అమీర్ ఖాన్ కి లాల్ సింగ్ చద్దా భారీ షాక్ ఇచ్చింది. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కి రీమేక్‌గా లాల్ సింగ్ చద్దా మూవీకి తెరకెక్కింది. ఈ సినిమా ఆగష్టు 11 న విడుదల కాగా.. ఫస్ట్ షో కే డిసాస్టర్ టాక్ రావడం, సోషల్ మీడియాలోనూ అమీర్ సినిమాపై విపరీతమైన నెగెటివిటి రావడంతో సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. 180 కోట్లతో నిర్మించిన ఈ సినిమాకి చివరికి 60 నుండి 70 కోట్లు రాబట్టడానికి కిందా మీదా పడింది. దానితో నిర్మాతలకి 100 కోట్ల నష్టం వచ్చింది. ఈ సినిమా కోసం అమీర్ నాలుగేళ్ళ కష్టం వృధా అయ్యింది. 

Advertisement
CJ Advs

అటు డబ్బుపోయింది, ఇటు అమీర్ మరో సినిమా ఒప్పుకోకుండా ఉండిపోవడంతో నాలుగేళ్లు వృధా అయ్యాయి.  తాజాగా లాల్ సింగ్ చద్దా ఫెయిల్యూర్ కి బాధ్యత వహిస్తూ అమీర్ ఖాన్ తన రెమ్యునరేషన్ ని వెనక్కి ఇచ్చేశారనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకి అమీర్ 50 కోట్ల పారితోషకం తీసుకున్నారని, 100 కోట్ల నష్టానికి పరిహారంగా తాను తీసుకున్న మొత్తం రెమ్యునరేషన్ ని అమీర్ వెనక్కి ఇచ్చేశారని అంటున్నారు. 

Aamir Khan returns his remuneration:

Aamir Khan returned his remuneration for Laal Singh Chaddha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs