Advertisement
Google Ads BL

చిరు అలా.. బన్నీ ఇలా..


ఈ రోజు వినాయక చవితి పర్వదినాన్ని టాలీవుడ్ ప్రముఖులు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. హీరో నాని భార్య కొడుకుతో పూజలు నిర్వహించగా.. మెగా ఫ్యామిలిలో మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ తో కలిసి వినాయకుడికి పూజలు నిర్వహించిన విషయాన్ని చిరు సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూస్తే అర్ధమవుతుంది. భార్య సురేఖ తో కలిసి పూజలు నిర్వహించిన చిరు.. తల్లి అంజనాదేవితో కలిసి వినాయకుడికి మొక్కారు. మనవరాలు(శ్రీజ డాటర్) నివిష్క తో మెగాస్టార్ పిక్ వైరల్ అయ్యింది. చిరు ఈ ఫొటోస్ ని షేర్ చేస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ! అందరి జీవితాలలో విఘ్నాలు తొలగి విజయాలు, సుఖ సంతోషాలు కలిగేలా ఆ విఘ్నేశ్వరుడు సదా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను! అంటూ ట్వీట్ చేసారు.

Advertisement
CJ Advs

అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డి, కూతురు అర్హ, కొడుకు ఆయన్ లతో కలిసి వినాయకునికి పూజలు నిర్వహించడమే కాదు, ఈ ఫెస్టివల్ రోజున ఫాన్స్ కి ట్రీట్ ఇస్తూ తాము పూజలు నిర్వహించిన విషయాన్ని ఫోటో గ్రాఫ్ఫ్స్ రూపంలో సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

Megastar Chiranjeevi family Vinayaka Chavithi celebrations:

Allu Arjun family Vinayaka Chavithi celebrations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs