Advertisement
Google Ads BL

కార్తికేయ హీరో నిఖిల్ పై సీనియర్ ఫైర్.!


కార్తికేయ 2 తో పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని.. అదిరిపోయే కలెక్షన్స్ తో ఎంజాయ్ చేస్తున్న నిఖిల్ పై దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆగ్రహం వ్యక్తం చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన సినిమాకి థియేటర్స్ ఇవ్వలేదంటూ దిల్ రాజు పై ఇండైరెక్ట్ కామెంట్స్ చేసిన నిఖిల్.. సక్సెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతున్నప్పుడు కామ్ గా ఎందుకున్నావ్.. అప్పుడు నువ్వు మైక్ తీసుకుని అదంతా అబద్దం మీరే మాకు థియేటర్స్ రాకుండా చేసారని దిల్ రాజు ని అడగొచ్చు కాదు.. అసలు నువ్ దిల్ రాజు ఇంటికి వెళ్లి థియేటర్స్ అడగాల్సిన అవసరం ఏముంది. నువ్ హీరోవి.. నిర్మాత చెయ్యాల్సిన పని నిర్మాత చేస్తాడు. నీ హీరో పనులు నువ్ చూసుకో.. దిల్ రాజు కి నీకు మధ్యలో జరిగిన విషయాన్ని మీడియా ముందుకు ఎందుకు తెచ్చావ్.. దిల్ రాజు పేరు చెప్పలేని వాడివి దిల్ రాజు ని అన్ పాపులర్ ఎందుకు చేసావ్..

Advertisement
CJ Advs

కార్తికేయ2 హిట్ అయ్యింది కాబట్టి కాలర్ ఎగరేస్తున్నావ్.. అదే సినిమా పోయుంటే మరో లైగర్ అయ్యేది.. కార్తికేయ కి ముందు హిట్ లేదు కదా.. ఇప్పుడు అన్ని కుదిరాయి కాబట్టి మాట్లాడుతున్నావ్.. ఎగిరెగిరి పడుతున్నావ్, మీడియా ముందు నిల్చుని కన్నీళ్లు పెట్టుకునే డ్రామాలు ఆపాలి, సక్సెస్ రాగానే కాలర్ ఎగరెయ్యడం తగ్గించాలి, ఇవన్నీ చూడడానికి అస్సహ్యంగా ఉంటాయి.. నీకు దమ్ముంటే థాంక్యూ కి పోటీగా విడుదల చెయ్యాల్సింది నీ కార్తికేయని, మాచర్ల తో పోటీ పడినప్పుడు థాంక్యూ తో పడలేకపోయావా.. నీకు గట్స్ ఉంటే విడుదల చేసి చూపించాల్సింది. అలా చేయకపోగా.. దిల్ రాజు ని బ్యాడ్ చెయ్యడం ఎందుకు, సక్సెస్ మీట్ లో మీడియా ముందే అతను దుర్మార్గుడు అని చెప్పాల్సింది.. హిట్ పడింది కదా అని ఎగిరి పడితే తర్వాత కింద పడతారు అంటూ తమ్మ రెడ్డి.. నిఖిల్ ని ఓ రేంజ్ లో కడిగిపారేశారు. 

Tammareddy Bharadwaj slams Karthikeya 2 hero Nikhil:

Senior producer Tammareddy Bharadwaja has roped in Karthikeya 2 hero Nikhil
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs