Advertisement
Google Ads BL

అప్పుడు చిల్ తాత.. ఇప్పుడు బెండయ్యాడు


‘మీరు మారిపోయారు సార్.. మీరు మారిపోయారు సార్’.. తాజాగా విజయ్ దేవరకొండ ఓ థియేటర్ ఓనర్ కాళ్లపై పడుతున్న వీడియో చూస్తుంటే.. ‘టెంపర్’ సినిమాలో పోసాని చెప్పిన ఈ డైలాగే గుర్తొస్తోంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా టైమ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఓ పోస్టర్‌పై చేసిన కామెంట్‌కి.. ‘చిల్ తాత’ అంటూ.. వీరలెవల్‌లో యాటిట్యూట్ ప్రదర్శించిన విజయ్ దేవరకొండేనే.. ఇలా బెండ్ అయింది అంటూ సోషల్ మీడియా కూడా.. విజయ్ గురించి మాట్లాడుకుంటోంది. దీనిని బట్టి.. సక్సెస్ ఉన్నోడిదే ఎప్పటికైనా ఇక్కడ రాజ్యమని.. ఇప్పటికి విజయ్ తెలుసుకుని ఉంటాడని.. ఇండస్ట్రీలోని పలువురు అనుకుంటుండటం విశేషం. మరి నిజంగా.. విజయ్ మారాడా? లేదంటే.. బాలీవుడ్ గుర్తింపు కోసం బెండ్‌ అయ్యాడా? అని కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. 

Advertisement
CJ Advs

 

ఎందుకంటే.. విజయ్ దేవరకొండది తగ్గే యాటిట్యూడ్ అయితే అస్సలు కాదు.. తనని అనకొండ అన్నటువంటి బాలీవుడ్ మరాఠా మందిర్ థియేటర్ ఓనర్, డిస్ట్రిబ్యూటర్ అయిన మనోజ్ దేశాయ్‌ని.. ‘ఎవడ్రా వాడు..’ అంటూ ‘అర్జున్ రెడ్డి’ తరహాలో కౌంటర్ వదిలేవాడు. కానీ అక్కడ ‘లైగర్’కి వచ్చిన రిజల్ట్.. విజయ్‌ని నత్తివాడిని చేసింది. అందుకే.. కామ్‌గా పోయి కాళ్ల మీద పడ్డాడు. తనకి కూడా మెచ్యూరిటీ వచ్చిందని.. తాజా ఇన్సిడెంట్‌తో విజయ్ అనిపించుకుంటున్నాడు. 

 

వాస్తవానికి ‘లైగర్’ విషయంలో విజయ్ 100 శాతం ఎఫర్ట్ పెట్టాడు.. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట ఇదే. కానీ, పూరితో సినిమా అనగానే.. సినిమా గురించి ఇంకేం పట్టించుకోలేదు. అందుకు కూడా కారణం ఉంది. వరుస ఫ్లాప్స్‌లో ఉన్న విజయ్‌కి.. పూరి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు. అందుకే మిగతావి ఏవీ విజయ్ పట్టించుకోలేదు. కాబట్టే.. ఈ ఫలితం.  సరే.. అయిపోయిందేదో అయిపోయింది.. ఇప్పుడు వచ్చిన మార్పుని తదుపరి సినిమాలపై పెట్టి హిట్టు కొట్టి చూపించాలంటూ.. ఈ రౌడీకి ఆయన ఫ్యాన్స్ సలహాలిస్తున్నారు.

Vijay Deverakonda Attitude Changed with Liger Result:

Vijay Deverakonda meets Mumbai theatre owner
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs