Advertisement
Google Ads BL

బాలీవుడ్ హీరో వల్ల నష్టపోయిన రష్మిక


పాన్ ఇండియా స్టయిల్లో పుష్ప తో హిట్ కొట్టి బాలీవుడ్ లో పాగా వెయ్యడానికి ట్రై చేస్తున్న రశ్మికకి.. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. తెలుగులో పుష్ప ద రూల్ కోసం రెడీ అవ్వాల్సిన రశ్మిక తమిళంలో స్టార్ హీరో విజయ్ తో వారసుడు చేస్తుంది. ఈ సినిమా సంక్రాంతి 2023న రిలీజ్ కాబోతుంది. అలాగే బాలీవుడ్ సిద్దార్థ్ మల్హోత్రా నటిస్తున్న రష్మిక అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్ తో మరో మూవీ చేసింది. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ ఛాన్స్ కొట్టేసింది.. బాలీవుడ్ లో ఏ పార్టీకి అటెండ్ అవ్వాలన్నా రష్మిక గ్లామర్ డోస్ పెంచే డ్రెస్సులతో హాజరవుతుంది. అయితే రష్మిక బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్న టైమ్ లో ఆమె ఒప్పుకున్న ఓ చిత్రం సెట్స్ లోకి వెళ్లకముందే ఆగిపోయింది అనే టాక్ వినిపిస్తుంది. అదే టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి రష్మిక చేస్తున్న స్క్రూ ఢీలా. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం ఆ చిత్రం ఆగిపోయినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కారణం టైగర్‌ ష్రాఫ్‌ అంటున్నారు. ఈ చిత్రం కోసం టైగర్‌ ష్రాఫ్‌ 35కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నాడు. అగ్రిమెంట్‌ కూడా చేసాక.. షూటింగ్‌ మొదలయ్యాక టైగర్‌ను తన రెమ్యునరేషన్‌ లో పదిహేను కోట్లు తగ్గించుకోమని కరణ్‌ జోహార్ అడిగాడట. పారితోషికం కింద ముందు 20కోట్లు తీసుకుని, తర్వాత లాభాల్లో వాటా తీసుకోవాలని కరణ్‌ టైగర్‌ ని అడిగాడట. కాని టైగర్‌ ఈ డీల్ కి ససేమీరా అనడంతో స్క్రూ ఢీలా మధ్యలోనే ఆగిపోయినట్లుగా తెలుస్తుంది. దానితో రష్మిక మంచి ఛాన్స్ మిస్ అయ్యింది అని తెగ బాధపడిపోతుందట.

Screw Dheela has been shelved:

Tiger Shroff and Rashmika Mandanna film Screw Dheela has been shelved
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs