Advertisement
Google Ads BL

బాలకృష్ణ కి షాకిచ్చిన సుప్రీం కోర్టు


నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం NBK107 షూటింగ్ లో బిజీ అవుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ NBK 107 పై అంచనాలు అదిరిపోతున్నాయి. అటు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటున్న బాలకృష్ణ ఈరోజు అన్న హరికృష్ణ మరణించిన రోజు కావడంతో.. హరికృష్ణ ఫోటో ని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టారు. అయితే బాలయ్య బాబు కి సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఎందుకంటే బాలకృష్ణ-క్రిష్ కలయికలో అపుడెప్పుడో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకి ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చినా.. టికెట్ ధరలు తగ్గించలేదు అంటూ సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Advertisement
CJ Advs

పన్ను రాయితీ ప్రయోజనాలను సినీ ప్రేక్షకులకు ఇవ్వలేదని ఆ ఫిర్యాదులో పేర్కొంది. పన్ను రాయితీ పొందిన డబ్బు తిరిగి ప్రభుత్వం రికవరీ చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది. ఈరోజు ఈకేసుని సుప్రీం కోర్టులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్ర చూడ్ ధర్మాసనం విచారించింది. ఈ కేసులో భాగంగా బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బాలకృష్ణకు కాదు అటు తెలంగాణ, ఇటు ఏపీ ప్రభుత్వాలకు సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.

Big Shock to Nandamuri Balakrishna Supreme court :

Supreme Court Big Shock To MLA Nandamuri Balakrishna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs