Advertisement
Google Ads BL

నాకు తిక్కరేగితే.. వేరేలా ఉంటుంది: శర్వా


వివాదాలకు చాల దూరంగా ఉండే హీరో శర్వానంద్. ప్రస్తుతం శర్వానంద్ కెరీర్ లో ఒడిడుకులు ఎదుర్కొంటున్నాడు. వరసగా ప్లాప్స్ శర్వా కి షాక్ లిస్తున్నాయి. జాను, శ్రీకారం, మహా సముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు ఇలా వరసగా డిజాస్టర్స్ తో సతమతమవుతున్న శర్వానంద్ ఇప్పుడు ఒకే ఒక జీవితం తో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా వున్న శర్వానంద్ తాను సినిమా చేసిన ఓ ప్రొడ్యూసర్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఓ నిర్మాత గత కొన్నాళ్లుగా నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నన్ను పారితోషకం తగ్గించుకోమని అడిగితె నేను నిర్మొహమాటంగా తగ్గించుకోను అని చెప్పానంటున్నాడాయన. 

Advertisement
CJ Advs

అసలైతే రెమ్యునరేషన్ నేను మాత్రం ఎందుకు తగ్గించుకోవాలి. నాక్రేజ్ ని నా మార్కెట్‌ను బ‌ట్టి నిర్మాత‌లు ఇచ్చే రెమ్యున‌రేష‌న్ అది. అది కూడా త‌గ్గించుకోవాల‌ని చెబుతున్నాడు. మ‌న‌కు ఆస్థి ఉంది. ఎందుకు నీకు ఈ సినిమా క‌ష్టాలు అని నా పేరెంట్స్ చెప్ప‌లేదు. నీ కాళ్ల మీద నువ్వు ఎద‌గాల‌ని చెప్పే పెంచారు. అలానే నేను ఎదుగుతున్నాను. ఆ నిర్మాత నన్ను మోసం చేసి నాపైనే ఆరోపణలు చేస్తున్నాడు. అయినా నేను ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పాను, ఆ నిర్మాతకు ఎంత లాభమొచ్చిందో నాకు తెలుసు, నాకు తిక్క రేగితే కథ వేరేలా ఉంటుంది అంటూ శర్వానంద్ టాలీవుడ్ లో ఓ ప్రొడ్యూసర్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవ్వగా.. ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరబ్బా అంటూ నెటిజెన్స్ ఆరాలు మొదలు పెట్టేసారు.

Sharwanand sensational comments on tollywood producer:

That producer cheated me.. Hero Sharwanand Sensational comments
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs