Advertisement
Google Ads BL

అందుకే రమ్య అక్కడ- నేనిక్కడ: కృష్ణవంశీ


ప్రస్తుతం డౌన్ ఫాల్ లో ఉన్న దర్శకుడు కృష్ణ వంశీ.. ఆయన భార్య రమ్య కృష్ణ కొంతకాలంగా విభేదాలతో కలిసి ఉండడం లేదంటూ చాలా రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. కృష్ణ వంశీ కి గత కొంతకాలంగా సక్సెస్ లు లేవు. అలాగే ఆయన తెరకెక్కించిన రంగమార్తాండ విడుదల ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయితే తాజాగా రమ్యకృష్ణ తో తనకి ఉన్న గొడవలు, కలిసి ఉండడం లేదనే వార్తలపై కృష్ణ వంశీ ఓ ఇంటర్వ్యూలో స్పందించడం ఆసక్తికరంగా మారింది. రమ్యకృష్ణ స్టార్ డమ్ ని మ్యాచ్ చెయ్యాలనే టెన్షన్ నాలో ఉంటుంది. నమ్మండి.. నిజంగానే నాకు రమ్య తో కాంపిటీషన్ ఉంటుంది. కొన్నేళ్లుగా నేను కొద్దిగా తగ్గినట్టుగా ఉన్నాను. అప్పుడప్పుడు మా మధ్యన వచ్చే గ్యాప్ మా బంధం ఇంకా గట్టిపడడానికే పనికొస్తుంది. తాను కెరీర్ దృష్యా చెన్నైలో ఉంటే.. నేను హైదరాబాద్ లో ఉంటున్నాను.

Advertisement
CJ Advs

నేను ఖాళీ ఉంటే చెన్నై వెళతాను, రమ్య ఖాళీ ఉంటే హైదరాబాద్ వస్తుంది. మా అబ్బాయి రిత్విక్ చాలా షార్ప్, చాలా యాక్టివ్‌ గా ఉంటాడు. ఇప్పుడు రిత్విక్‌కి టీనేజ్‌. 10th క్లాస్ చ‌దువుతున్నాడు. ఒక వారం క్రికెట్ అంటాడు. ఇంకో వారం బిజినెస్ అంటాడు. ఇంకో వారం క్రిప్టో క‌ర‌న్సీ అంటాడు. అందులోనూ చెన్నై లో పెరిగాడు క‌దా. చెన్నైలో జ‌న‌మే కాస్త యాక్టివ్‌గా ఉంటారు. అయితే అప్పుడ‌ప్పుడూ వాళ్ల‌మ్మ‌తో సెట్స్ కి వ‌స్తాడు. ర‌మ్యకృష్ణ ఎప్పుడూ కొడుకు మీద ఓ క‌న్నేసి ఉంటుంది. ర‌మ్య అక్క‌డ‌, మీరిక్క‌డా అంటూ చాలామంది అడుగుతుంటారు. వాటికి మేమే రియాక్ట్ కావ‌డం లేదు. మీరేం కంగారు ప‌డొద్దు, బాధ‌ప‌డొద్దు. నేనూ, ర‌మ్య క‌లిసే ఉన్నాం అంటూ కృష్ణ వంశీ తన భార్య తో తాను కలిసే ఉన్నారా అన్న విషయంపై స్పష్టంగా స్పందించారు.

I am in Hyderabad..Ramyakrishna is staying in Chennai:

Why Ramyakrishna Living Separately With Kid In Chennai?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs