Advertisement
Google Ads BL

మనోజ్ కాళ్ళు మొక్కిన విజయ్ దేవరకొండ


విజయ్ దేవరకొండ తానో పెద్ద స్టార్ లా ఫీలై.. లైగర్ ప్రమోషన్స్ లో కాస్త ఎక్కువగా మాట్లాడాడనే అభిప్రాయాలూ సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. లైగర్ టాక్ చూసిన తర్వాత ఆ కామెంట్స్ మరింత ఎక్కువయ్యాయి. మా అయ్యా తెల్వడు, మా తాత తెల్వడు.. అయినా నా పై ఎందుకింత అభిమానం అంటూ టాలీవుడ్ నేపోటిజంపై విజయ్ చేసిన వ్యాఖ్యలు, లైగర్ బాయ్ కాట్ హాష్ టాగ్ తర్వాత నా సినిమాని బాన్ చేస్తే చేసుకోండి, థియేటర్స్ లో చూడకపోతే ఓటిటిలో చూస్తారంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపడం కాదు, లైగర్ విడుదల తర్వాత ఆ సినిమాకి ఆక్యుపెన్సీ లేకపోవడంతో ముంబై థియేటర్ ఓనర్ మనోజ్ దేశాయ్ విజయ్ దేవరకొండపై విరుచుకుపడ్డారు. నువ్వు దేవరకొండవి కాదు, అనకొండవి, సినిమా థియేటర్స్ లో చూడకపోతే ఓటిటిలో చూస్తారంటూ నీవు చేసిన వ్యాఖ్యలతో టికెట్స్ తెగడం లేదు.

Advertisement
CJ Advs

నీదేం పోయింది, నిర్మాతలేదేం పోయింది.. మునిగిపోయేవాళ్ళం మేము, మా డిస్ట్రిబ్యూటర్స్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చలకు దారితీసాయి. అయితే మనోజ్ చేసిన వ్యాఖ్యలతో విజయ్ దేవరకొండ ముంబై వెళ్లి ఆయన్ని కలవడమే కాదు, తాను ఏమి తప్పుగా మాట్లాడలేదు అని, తాను ఏం మాట్లాడిందనే విషయం గురించి పూర్తి వీడియోను చూపించడమే కాకుండా తాను తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని మనోజ్ దేశాయ్‌కి తెలిపాడు. దానితో మనోజ్ దేశాయ్ విజయ్ దేవరకొండకు సారీ చెప్పారు. నేను పొరబాటు పడ్డాను, పూర్తి వీడియో చూడకుండా నాకు పంపిన క్లిప్ చూసి నా బిడ్డ లాంటి విజయ్ ని దూషించాను అంటూ విజయ్ కి సారి చెప్పగా.. మీరు నాకు సారి చెప్పొద్దూ అంటూ విజయ్ దేవరకొండ మనోజ్ దేశాయ్ కాళ్ళు మొక్కడం చూసిన రౌడీ ఫాన్స్ చూసారా మా హీరో తప్పు చెయ్యకపోయినా.. పెద్దలని గౌరవిస్తున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Vijay Devarakonda touches Manoj Desai feet:

Manoj Desai apologises after blasting Vijay Devarakonda
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs