Advertisement
Google Ads BL

చిరు వాల్తేర్ వీరయ్య లుక్


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ తో దసరా ఫెస్టివల్ కి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. తర్వాత భోళా శంకర్ అలాగే దర్శకుడు బాబీ తో వాల్తేర్ వీరయ్య మూవీస్ ని చకచకా ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. అందులోను మెగా 154 ని బాబీ వచ్చే సంక్రాంతికే రిలీజ్ అంటూ ప్రకటించాడు కూడా. అయితే ప్రస్తుతం వాల్తేర్ వీరయ్య మూవీ షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. దర్శకుడు బాబీ తండ్రి మరణంతో కొద్దిరోజులపాటు వాల్తేర్ వీరయ్య షూటింగ్ ని ఆపేసారు. వాల్తేర్ వీరయ్యగా చిరు మాస్ గా కనిపించబోతున్నారు. మరో హీరో రవితేజ చిరు కి సవతి సోదరుడిగా ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఇంకా టైటిల్ రివీల్ చెయ్యని ఈ సినిమాకి వాల్తేర్ వీరయ్య టైటిల్ నే ఫైనల్ చెయ్యబోతున్నారు మేకర్స్.

Advertisement
CJ Advs

సవతి సోదరుల కథగా తెరకెక్కబోతున్న వాల్తేర్ వీరయ్య ఫస్ట్ లుక్ లోనే చిరు ఊర మాస్ గా కనిపించారు. తాజాగా ఈ సినిమాలో చిరు లుక్ ఒకటి రివీల్ అయ్యింది. చిరు కాస్త రఫ్ గా రెడ్ బనియన్, హాఫ్ హ్యాండ్ షర్ట్ తో కనిపిస్తున్నారు. వాల్తేర్ వీరయ్య గా చిరు లుక్ చూసిన మెగా ఫాన్స్ మళ్ళీ ముఠా మేస్త్రి లో చిరుగా కనిపిస్తున్నారని, ముఠామేస్త్రి లాంటి బిగ్గెస్ట్ హిట్ వాల్తేర్ వీరయ్య కూడా అవుతుంది అంటూ పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో చిరు కి జోడిగా శృతి హాసన్ నటిస్తుంది.

Chiranjeev leaked look from Waltair Veeraiah :

Chiranjeev mass waves as Waltair Veeraiah
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs