Advertisement
Google Ads BL

బాలీవుడ్ అంటే అంత ఉండాల్సిందే


ఇప్పుడంటే బాలీవుడ్ పరిస్థితి బాలేదు కానీ.. ఒకప్పుడు బాలీవుడ్ మూవీస్ 1000 కోట్ల కలెక్షన్స్ తో బాక్సాఫీసుని షేకాడించేవి. బాహుబలి తరువాతే సౌత్ సినిమాలు హైలెట్ అవుతున్నాయి కానీ, అంతకుముందు బాలీవుడ్ మూవీస్ ని తలదన్నే సినిమాలు ఎక్కడా రాలేదు. ఇప్పుడు సౌత్ ముందు బాలీవుడ్ వెల వెల బోతుంది. అదలా ఉంటే.. తమిళ నటుడు విజయ్ సేతుపతి అటు హీరోగానూ ఇటు విలన్ గానే కాకుండా కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను తన టాలెంట్ చూపిస్తున్నారు. రీసెంట్ గా విక్రమ్ మూవీలో విజయ్ సేతుపతి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఆయన పారితోషకం ఇప్పడు అమాంతం పెరిగిపోయింది. గతంలోనే తెలుగులో ఉప్పెన సినిమా చేసిన విజయ్ కి మేకర్స్ దాదాపుగా 4 కోట్లు ఇచ్చారని అన్నారు. అలాగే మాస్టర్ లో విలన్ గా, విక్రమ్ లో విలన్ గా విజయ్ సేతుపతి 10 నుండి 15 కోట్లు అందుకున్నారని అన్నారు.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు విజయ్ సేతుపతి షారుఖ్ ఖాన్ - నయనతార కాంబోలో కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న జవాన్ మూవీలో నటిస్తున్నారు. జవాన్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నాడట. ఈ పాన్‌ ఇండియా సినిమాకోసం ఆయన్ను ఒప్పించేందుకు అక్షరాలా 21 కోట్ల రూపాయలు ముట్టజెపుతున్నారట మేకర్స్. జవాన్‌ సినిమా కోసం అప్పటికే లైన్‌లో ఉన్న రెండు సినిమాలను కూడా విజయ్ సేతుపతి వదిలేసుకున్నట్లు తెలుస్తుంది. అందుకే విజయ్ సేతుపతి అడిగింది ఇచ్చేందుకు జవాన్‌ నిర్మాతలు రెడీ అయ్యారట.

Vijay Sethupathi charges Rs 21 crore to come on board Jawan:

Vijay Sethupathi to charge Rs 21 crore for Shah Rukh Khan Jawan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs