Advertisement
Google Ads BL

వారికి హిట్టవసరం.. వీరికి అనూహ్యంగా హిట్టు!


ప్రస్తుతం ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా.. హిట్టు కొట్టిన వారికే గుర్తింపు వస్తుంది. హిట్టు లేకపోతే, రాకపోతే మెగాస్టార్ చిరంజీవి వంటి వారిని కూడా పక్కన పెట్టేస్తున్నారు.. ఫ్లాప్ లిస్ట్‌లోకి చేర్చేస్తున్నారు. హిట్టు వస్తే చిన్న హీరోనైనా పాన్ ఇండియా రేంజ్ హీరోగా అభివర్ణిస్తున్నారు. అందుకు నిదర్శనం హీరో నిఖిలే. ఇక హీరోల సంగతి అలా ఉంటే.. హీరోయిన్ల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అయితే.. ఆ హీరోయిన్‌లను ఐరన్ లెగ్‌తో పోల్చుతూ పక్కన పడేస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్‌లోకి టాప్ హీరోయిన్లు ఎందరో చేరిపోయారు. టాప్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఇప్పుడీ లిస్ట్‌లోకి చేరిపోయింది. గత కొన్ని సినిమాలుగా ఆమెకు హిట్టు అనేది పడటం లేదు. ఆమెకే కాదు.. సమంత, సాయిపల్లవి, రాశీ ఖన్నా, రెజీనా, పాయల్ రాజ్‌పుత్, లావణ్య త్రిపాఠితో పాటు యంగ్ సెన్సేషన్ కృతిశెట్టి కూడా ఇప్పుడు వరుస పరాజయాలతో ఫ్లాప్‌ లిస్ట్‌లోకి చేరిపోయింది. ఈ లిస్ట్‌లో ఉన్న హీరోయిన్లకు ఇప్పుడు అర్జెంట్‌గా హిట్టు కావాలి... హిట్టుకాకుండా.. ఇలాగే ఇంకో రెండు మూడు ఫ్లాప్స్ పడితే.. దాదాపు వీరిని మరిచిపోవడం ఖాయం. 

Advertisement
CJ Advs

 

ఇదిలా ఉంటే.. ఇప్పుడు అనూహ్యంగా ఫ్లాప్‌లో ఉన్న హీరోయిన్లు హిట్టు రేసులోకి రావడం విశేషంగా చెప్పుకోవాలి. ‘కార్తికేయ 2’ చిత్రంతో అనుపమ పరమేశ్వరన్ రాత ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాకి ముందు అనుపమ పరిస్థితి దారుణమంటే దారుణంగా ఉంది. చివరికి ఎక్స్‌పోజింగ్‌కి, లిప్‌కిస్‌లకి సైతం ఆమె రెడీ అయిపోయింది. కానీ, ‘కార్తికేయ 2’ చిత్రంలో ఆమె అటువంటివి ఏమీ చేయకుండానే.. మంచి హిట్టు.. అందులోనూ పాన్ ఇండియా గుర్తింపుని ఇచ్చే హిట్టు ఆమె ఖాతాలో పడింది. అలాగే.. పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలో నటించినా.. కేథరిన్, సంయుక్తా హెగ్డేకి ‘బింబిసార’ రూపంలో మంచి హిట్టు పడింది. వారి గురించి కూడా మాట్లాడుకునేలా చేసింది. ‘గని’తో పరాజయం చవిచూసినా.. ‘మేజర్’తో సైయి మంజ్రేకర్ మంచి విజయాన్ని అందుకుంది. ఆమె కూడా.. ఇప్పుడు హిట్టు హీరోయిన్ రేసులోకి వచ్చేసింది. 

 

ఇక వీరందరి కంటే కూడా మంచి గుర్తింపుని, హిట్టుని అందుకుంది మృణాళ్ ఠాకూర్. ‘సీతా రామం’ చిత్రంతో ఆమెకు అద్భుతమైన హిట్టు వశమైంది. ఇప్పుడామె పేరును చాలా సినిమాలకు అనుకుంటున్నారంటే.. ఆమె నటనకు ఎటువంటి గుర్తింపు లభించిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు హాట్ టాపిక్, హిట్టు టాపిక్.. మొత్తం ఆమెనే. ముందు ముందు ఆమెను మరిన్ని మంచి చిత్రాల్లో చూసే అవకాశం ఉంది. అంత చక్కని నటనను ఆ సినిమాలో ఆమె కనబరిచింది. ఇక ఇదే సినిమాలో కీలక పాత్రలో నటించిన ‘రష్మిక మందన్నా’ కూడా.. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఫ్లాప్ నుండి కాస్త బయటపడింది. ఇప్పుడామె చేతిలో ప్రభాస్, విజయ్‌ల చిత్రాలతో పాటు.. ‘పుష్ప 2’ కూడా ఉండటంతో.. తన టాప్ ఛైర్‌ని ఆమె కాపాడుకున్నట్లే. రేసులో విజయం సాధించిన గుర్రాన్నే ఎలా గుర్తు పెట్టుకుంటారో.. అలాగే ఇక్కడ హిట్టు కొట్టిన హీరోయిన్లకే ఇంపార్టెన్స్ ఇస్తారన్నది.. ఆ యా హీరోయిన్లకు కూడా తెలుసు. అందుకే, అవకాశం వస్తే చాలు అన్నట్లుగా కొన్ని సార్లు వారి బిహేవియర్ ఉంటుంది. ఏదిఏమైనా చివరికి మాత్రం వారిని కాపాడేది కంటెంటే అనే విషయం గుర్తిస్తేనే.. వారికి కొన్నాళ్ల పాటు మనుగడ ఉంటుందన్నది కాదనలేది నిజం. 

Flop Heroines Got Pan India Range Hit :

These Heroines Wants Hit Movie 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs